News March 5, 2025
VJA: ఈ నెల 8న మహిళల కోసం కొత్తగా యాప్

మహిళల రక్షణ కోసం శక్తి యాప్‌ను అందులోకి తెస్తున్నట్లు హోం మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. మంగళవారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రక్షణకు టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈనెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు శక్తి యాప్‌ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. నెట్వర్క్ లేని ప్రాంతాల్లో సైతం ఈ యాప్ పనిచేసే విధంగా రూపకల్పన చేసినట్లు మంత్రి చెప్పారు.
Similar News
News March 25, 2025
KU: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని KU అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.
News March 25, 2025
39మంది ఎంపీలతో పీఎంను కలుస్తాం: స్టాలిన్

డీలిమిటేషన్ విషయంలో తమ రాష్ట్రానికి చెందిన 39మంది ఎంపీలతో కలిసి ప్రధాని మోదీని మీట్ అవుతామని తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు. ‘ఇటీవల ముగిసిన అఖిలపక్ష సమావేశంలో చేసిన తీర్మానాల ఆధారంగా తయారుచేసిన నివేదికను రాష్ట్రం నుంచి ఉన్న ఎంపీలందరితో కలిసి ప్రధానికి అందిస్తాం. తమిళనాడు పోరాటాన్ని ఆపదు. కచ్చితంగా ఈ పోరులో విజయం సాధిస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు.