News March 24, 2025

VJA: క్షయ నివారణపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

క్షయ వ్యాధి నివారణపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించి వ్యాధిగ్రస్తులను గుర్తించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో క్షయ వ్యాధి నివారణ అవగాహన పై రూపొందించిన వాల్‌ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షయ చికిత్సతో పాటు పౌష్టికాహారాన్ని అందించి జిల్లాను క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

Similar News

News September 17, 2025

HYD: ప్రపంచాన్ని ఆకర్షించేలా మూసీని మారుస్తాం: సీఎం

image

మూసీని శుద్ధి చేసి HYDను సుందరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తేల్చిచెప్పారు. ప్రజాపాలన వేడుకల్లో మాట్లాడుతూ.. మూసీ చుట్టూ బతుకుతున్న ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామని, మూసీని శుద్ధి చేసి కొత్త ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తామన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా మూసీ నదిని మారుస్తామన్నారు.

News September 17, 2025

HYDలో జాతీయ జెండా ఆవిష్కరించిన కవిత

image

తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు ఎంకే. మొయినుద్దీన్‌ని శాలువా పూలమాలలతో సత్కరించారు.

News September 17, 2025

గ్రూప్-1పై డివిజన్ బెంచ్‌కు టీజీపీఎస్సీ

image

TG: గ్రూప్-1 మెయిన్స్‌ <<17655670>>ఫలితాలను<<>> రద్దుచేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. ఈ నెల 9న ఫలితాలను రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.