News February 13, 2026
VJA: గవర్నర్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ

విజయవాడలోని లోక్ భవన్‌లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం కలిశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగం ప్రభుత్వ లక్ష్యాలను, అభివృద్ధి దిశను స్పష్టంగా ప్రతిబింబించిందని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై గవర్నర్‌తో పవన్ చర్చించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం.
Similar News
News March 6, 2026
గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం!

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల నడుమ LPG విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్లను ప్రధానంగా గృహ వినియోగదారులకే సరఫరా చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు స్పష్టం చేసింది. IOCL, BPCL, HPCLకు ఆదేశాలు జారీ చేసింది. కమర్షియల్, ఇండస్ట్రియల్, పెట్రో కెమికల్ రంగాలకు గ్యాస్ సప్లైపై తాత్కాలిక పరిమితులు విధించింది. సాధారణ ప్రజలకు LPG సరఫరాలో అంతరాయం ఉండొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
News March 6, 2026
చిత్తూరు SE కీలక ఆదేశాలు

వేసవి నేపథ్యంలో అవసరాల మేరకు ట్రాన్స్‌ఫార్మర్లను నిల్వ చేసుకోవాలని చిత్తూరు ట్రాన్స్‌కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ ఆదేశించారు. ప్రస్తుతం నెలకు 400 పైగా ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతుకు గురవుతున్నాయన్నారు. ఏప్రిల్‌లో ఈ సంఖ్య రెండింతలు వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. అప్పుడు ఇబ్బంది పడకుండా కనీసం 1,800 ట్రాన్స్‌ఫార్మర్లను నిల్వ చేసుకోవాలని సూచించారు.
News March 6, 2026
బాపట్ల: స్కూల్‌లో అలజడి.. HMపై కులవివక్ష ఆరోపణలు

కర్లపాలెం మండలంలోని పేరలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తమ పట్ల కుల వివక్ష చూపుతున్నారని విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. దీంతో పాఠశాలలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఈ వివాదం ముదరడంతో విషయం శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరినట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


