News March 13, 2025

VJA: టీడీపీ నేతలపై కేసు కొట్టివేత

image

ఓబులాపురం మైనింగ్‌పై గతంలో టీడీపీ నేతలు చేసిన ఆందోళనలకు సంబంధించిన కేసును విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, చినరాజప్ప, ధూళిపాళ్ల నరేంద్ర, జనార్దన్ రెడ్డి సహా పలువురు నేతలు ఈ కేసు నుంచి విముక్తి పొందారు. గురువారం ఉదయం విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు వద్దకు టీడీపీ శ్రేణులు చేరుకున్నారు.

Similar News

News November 21, 2025

నాగర్‌కర్నూల్ నూతన ఎస్పీగా సంగ్రామ్ సింగ్ పాటిల్

image

తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేసింది. బదిలీల్లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీగా గైక్వాడ్ వైభవ్ రంగనాథ్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో నూతన ఎస్పీగా సంగ్రామ్ సింగ్ పాటిల్‌ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే సంగ్రామ్ సింగ్ పాటిల్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

News November 21, 2025

మేడికొండూరు: నిన్న కూతూరి పెళ్లి.. ఇవాళ గుండెపోటుతో తండ్రి మృతి

image

నిన్నటి పెళ్లి పందిరిలో సందడి ఇంకా ముగియక ముందే మేడికొండూరు మండలం డోకిపర్రులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 30 ఏళ్ల సుదీర్ఘ కాలంగా సీనియర్ పాత్రికేయుడిగా సేవలందిస్తున్న దావాల వెంకట రావు శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. నిన్ననే తన కూతురి వివాహాన్ని జరిపించి, ఆ ఆనందంలో ఉండగానే విధి ఇలా చిన్నచూపు చూసింది. మూడు దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

News November 21, 2025

కృష్ణా జలాలపై జగన్ హెచ్చరిక

image

AP: కృష్ణా జలాల విషయంలో మరోసారి సంక్లిష్ట పరిస్థితి ఏర్పడిందని YCP అధినేత YS జగన్ ట్వీట్ చేశారు. CM చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపైనే రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే KWDT-II విచారణలో తెలంగాణ 763 TMCలను డిమాండ్ చేస్తోందని, బచావత్ ట్రైబ్యునల్ APకి కేటాయించిన 512 TMCల్లో ఒక్క చుక్కనూ కోల్పోకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని హెచ్చరించారు.