News March 13, 2025
VJA: టీడీపీ నేతలపై కేసు కొట్టివేత

ఓబులాపురం మైనింగ్‌పై గతంలో టీడీపీ నేతలు చేసిన ఆందోళనలకు సంబంధించిన కేసును విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, చినరాజప్ప, ధూళిపాళ్ల నరేంద్ర, జనార్దన్ రెడ్డి సహా పలువురు నేతలు ఈ కేసు నుంచి విముక్తి పొందారు. గురువారం ఉదయం విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు వద్దకు టీడీపీ శ్రేణులు చేరుకున్నారు.
Similar News
News March 21, 2025
CMను కలిసిన అనంత దళిత ఎమ్మెల్యేలు

అమరావతిలో సీఎం చంద్రబాబును శింగనమల, మడకశిర ఎమ్మెల్యేలు బండారు శ్రావణి శ్రీ, ఎంఎస్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. దళితులందరికీ సమాన న్యాయం చేకూరాలనే ఉక్కు సంకల్పంతో చంద్రబాబు గతంలో చూపిన చొరవకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయడానికి దళిత శాసనసభ్యులందరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
News March 21, 2025
ఎంఎస్ ధోనీ అన్ని సీజన్ల స్కోర్లు ఇవే

భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ IPL తొలి సీజన్ నుంచి ఆడుతున్నారు. ఇప్పటికీ తన ఆటతీరుతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. 43 ఏళ్ల వయసులో IPL 2025లో ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ధోనీ అన్ని సీజన్ల స్కోర్లు ఇలా ఉన్నాయి. 2008-414, 2009-332, 2010-287, 2011-392, 2012-358, 2013-461, 2014-371, 2015-372, 2016-284, 2017-290, 2018-455, 2019-416, 2020-200, 2021-114, 2022-232, 2023-104, 2024లో 161 రన్స్ చేశారు.
News March 21, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

✔GET READY.. రేపే టెన్త్ పరీక్షలు✔టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి:MEOలు✔తాగునీటి తలెత్తకుండా చర్యలు తీసుకోండి: కలెక్టర్లు✔ముగిసిన ఇంటర్ పరీక్షలు✔NGKL:SLBC టన్నెల్‌లో సహాయక చర్యలు ముమ్మరం✔MBNR:కేంద్ర మంత్రిని కలిసిన MP,MLA✔సీఎం రేవంత్ రెడ్డి విప్లవ నాయకుడు: మల్లు రవి✔పాలెంలో అంబులెన్స్ దగ్ధం✔NGKL: ఘనంగా బంజారాల హోలీ సంబరాలు