News March 28, 2025

VJA: ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్‌ల అందజేత

image

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్‌.వి. రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో విజయవాడ నగర దాతలు డాక్టర్ రమేశ్, లక్ష్మణ చౌదరి సహాయంతో ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ బ్యాగ్‌లు అందజేశారు. వీటిలో మిల్టన్/సెల్లో వాటర్ బాటిల్స్, ఎలక్ట్రాల్ సాచెట్‌లు, నాప్‌కిన్లు, ఫాస్ట్‌ట్రాక్ కళ్లజోడు, క్యారీ బ్యాగ్ ఉన్నాయి. ఈ కిట్‌ను సీపీ శుక్రవారం ట్రాఫిక్ సిబ్బందికి అందించారు. 

Similar News

News April 24, 2025

పాక్‌పై సానుభూతి చూపేదిలేదు: కిషన్‌రెడ్డి

image

దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉగ్రదాడి వెనకున్న పాక్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం మంచి పరిణామమన్నారు. ఆ దేశంపై సానుభూతి చూపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు దౌత్యపరమైన సమాధానమే ఇచ్చామని, త్వరలో మిలటరీ పరంగానూ ఆన్సర్ ఉంటుందని తెలిపారు. ఉగ్రదాడిలో పోయిన ప్రతి ప్రాణానికి ప్రతీకారం తప్పదనే సంకేతాలు కేంద్రం ఇచ్చిందన్నారు.

News April 24, 2025

నిర్మల్: వడదెబ్బతో మత్స్యకారుడు మృతి

image

ముధోల్ మండలం ఆష్ట గ్రామానికి చెందిన గుమ్మల గంగారాం(40) అనే మత్స్యకారుడు వడదెబ్బతో బుధవారం మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ప్రతి రోజూ ఎండలో చేపలు వేటకు వెళ్లి వచ్చేవాడు. వేటాడిన చేపలను ముధోల్ ప్రాంతాలకు వెళ్లి విక్రయించేవాడు. ఎండలో తీవ్ర అస్వస్థకు గురై ముధోల్‌లో మృతి చెందారు. స్థానికులు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు.

News April 24, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

error: Content is protected !!