News February 21, 2025
VJA: నేడు కోర్టు తీర్పు

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టైన వైసీపీ నేత వంశీ కస్టడీ, హెల్త్ పిటిషన్పై గురువారం విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఇరువర్గాల వాదనలు పూర్తి అయ్యాయి. కాగా ఈ రెండింటిపై శుక్రవారం కోర్టు తీర్పు ఇవ్వనున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది. అటు నేడు వంశీ సహా ఈ కేసులోని మరో ఇద్దరు నిందితుల కస్టడీ పిటిషన్లపై కోర్టు తీర్పు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Similar News
News December 5, 2025
వినూత్న విద్యతోనే పిల్లల భవిష్యత్: సీఎం చంద్రబాబు

AP: పిల్లలు వినూత్న కార్యక్రమాలకు ముందుండాలని, వారి ప్రతిభను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి లోపాలను వెంటనే సరిచేయాలని CM చంద్రబాబు ఉపాధ్యాయులు, పేరెంట్స్కు చెప్పారు. పార్వతీపురం మన్యం(D) భామినిలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో CM పాల్గొని మాట్లాడారు. చదువుతో పాటు ఆటలు, పాటలు కూడా అవసరమని అభిప్రాయపడ్డారు. పిల్లల బలాలు, బలహీనతలు గుర్తించి అన్ని సబ్జెక్టుల్లో బలమైన పునాది వేయాలని సూచించారు.
News December 5, 2025
సికింద్రాబాద్: ‘పుష్ప’ స్టైల్లో హవాలా డబ్బు రవాణా

సికింద్రాబాద్లో ‘పుష్ప’ సినిమా స్టైల్లో హవాలా డబ్బు రవాణా చేస్తున్నారు. దీంతో 15 కిలోమీటర్లు బోయిన్పల్లి పోలీసులు సాహసోపేతంగా ఛేజ్ చేసి ముఠాను అడ్డగించారు. కార్ డిక్కీ, టైర్లు, బానెట్, సీట్లలో దాచిన భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఛేజ్ చేసి పట్టుకున్న ఈ హవాలా గ్యాంగ్ రూ.కోట్లు తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 5, 2025
క్షమాపణ కోరిన రంగనాథ్

TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు హాజరయ్యారు. బతుకమ్మ కుంట వివాదంలో న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించినందుకు క్షమాపణ కోరారు. ఆ స్థలంలో యథాతథస్థితి కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులివ్వగా రంగనాథ్ ఉల్లంఘించారంటూ సుధాకర్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించినా కమిషనర్ వెళ్లలేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించడంతో రంగనాథ్ కోర్టుకు వెళ్లారు.


