News March 17, 2025
VJA: పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీలు

10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో సోమవారం కలెక్టర్ లక్ష్మీశ విజయవాడలోని గవర్నర్‌పేట సీవీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. వేసవి నేపథ్యంలో తాగునీరు, విద్యుత్తు సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News November 15, 2025
డాక్టర్ డ్రెస్‌లో ఉగ్రవాది

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు నిందితుడు, జైషే మహమ్మద్ ఉగ్రవాది ఉమర్ డాక్టర్ డ్రెస్‌లో ఉన్న ఫొటో బయటకు వచ్చింది. మెడలో స్టెతస్కోప్ వేసుకుని కనిపించాడు. కాగా ఈనెల 10న జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. NIA, ఇతర భద్రతా సంస్థలు ఉమర్ నెట్వర్క్ గురించి లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఉమర్ ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీలో వైద్యుడిగా పని చేసేవాడు.
News November 15, 2025
ఇలాంటి ఫుడ్ రోజూ తింటే..

రెడీ టు ఈట్ ఫుడ్స్‌ను తరుచూ తీసుకుంటే 50 ఏళ్లలోపు వారిలో పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదం అధికంగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. ‘రోజుకు మూడుసార్లు ప్రాసెస్డ్ ఫుడ్స్ తినేవారితో పోల్చితే 10సార్లు తినే మహిళల్లో అడెనోమా(క్యాన్సర్ కాని కణతులు) ముప్పు 45% ఎక్కువగా ఉంటుంది. ఇవే క్రమంగా క్యాన్సర్‌గా మారుతాయి’ అని USకు చెందిన JAMA ఆంకాలజీ పేర్కొంది. ఇందుకోసం 20 ఏళ్లలో 30వేల మందిపై సర్వే చేసినట్లు తెలిపింది.
News November 15, 2025
రంగారెడ్డి కలెక్టరేట్లో కుర్చీలను ఇలా వాడుతారా?

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వింత సంఘటన చోటు చేసుకుంది. పార్సిల్, ఇతర వస్తువులను తరలించేందుకు సిబ్బంది కొత్త పంథా ఎంచుకున్నారని కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అట్ట డబ్బాలను తరలించేందుకు ట్రాలీలను వాడాల్సింది పోయి.. ఏకంగా ఆఫీసు కుర్చీలనే ఉపయోగిస్తున్నారని వాపోయారు. కుర్చీలను ఇలా వాడడం వీరికే చెల్లిందని కలెక్టరేట్‌కు వచ్చిన వారు గుసగుసలాడుకుంటున్నారు.


