News April 2, 2025
VJA: ప్రత్యేక గుర్తింపునకు భాగస్వాములుకండి: కలెక్టర్

విజయవాడ నగరానికి బ్రాండ్ ఇమేజ్ టైటిల్, ట్యాగ్‌లైన్‌ను ఆహ్వానిస్తూ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ బుధవారం ప్రకటన విడుదల చేశారు. భౌగోళికంగా, చారిత్రకంగా విద్య, వైద్య, పారిశ్రామిక, సాంస్కృతిక, కళా రంగాల్లో గుర్తింపు పొందిన విజయవాడ నగరం రాజధాని అమరావతికి ముఖద్వారం కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుందన్నారు.
Similar News
News April 10, 2025
మిర్యాలగూడ: పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి పంచాయతీ కార్యదర్శి పెసర యాదగిరిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారన్న ఆరోపణలపై జిల్లా అధికారులు విచారణ చేశారు. ఓ వ్యక్తికి చెందిన నివాస గృహాల మ్యుటేషన్ విషయంలో రిజిస్టర్‌లో మార్పులు చేశారని రుజువు కావడంతో కలెక్టర్ సస్పెండ్ చేశారు.
News April 10, 2025
నిర్మల్ : నేడు, రేపు సదరం క్యాంపు

నిర్మల్ జిల్లాలో ఈనెల 10, 11వ తేదీన జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సదరం క్యాంపును నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ డీఆర్డీఓ శ్రీనివాస్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఇదివరకు ఆన్‌లైన్లో స్లాట్ బుక్ చేసుకొని వెయిటింగ్ లిస్టులో ఉన్న వారు ఫ్లాట్ బుకింగ్ రసీదు, ఆధార్ కార్డ్, సంబంధిత పత్రాలతో ఉదయం 9 గంటలకు జిల్లా ఆసుపత్రికి రావాలన్నారు.
News April 10, 2025
ఎంపీ మేడాకు నోటీసులు

MP మేడా రఘునాథరెడ్డి, మాజీ MLA మేడా మల్లిఖార్జునరెడ్డిలకు JC రాజేంద్రన్ నోటీసులు జారీ చేశారు. వీరు నందలూరు (M) లేబాకలో పేదల పేరుతో అక్రమంగా దాదాపు 109 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారనే ఆరోపణల కారణంగా నోటీసులు ఇచ్చారు. దీనిపై సరైన వివరణ ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని JC హెచ్చరించారు.