News March 23, 2025

VJA: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై సెంట్రల్(MAS), సంత్రాగచ్చి(SRC) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 26న MAS-SRC(నం.06077), ఈనెల 24, 28న SRC- MS(నం.06078) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు శ్రీకాకుళం రోడ్, పలాస, విజయనగరం, దువ్వాడ, రాజమండ్రితో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

Similar News

News March 29, 2025

రేపు కలెక్టర్ కార్యాలయం వద్ద ఉగాది వేడుకలు

image

ఉగాది ఉత్సవాలను ఆదివారం ఉదయం గం.10.30ల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న ఎపీ‌హెచ్‌ఆర్‌డీ సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఒక ప్రకటనలో శనివారం తెలిపారు. ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

News March 29, 2025

ఎంపురాన్‌లో ఆ సీన్స్ కట్ చేస్తున్నాం: నిర్మాత

image

మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన ‘ఎల్2: ఎంపురాన్’ సినిమాపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దాని నిర్మాత గోకులం గోపాల్ స్పందించారు. ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని దర్శకుడు పృథ్వీరాజ్‌కు సూచించినట్లు తెలిపారు. ఎంపురాన్ సినిమా ప్రారంభంలో వచ్చే కొన్ని సన్నివేశాలతోపాటు ఓవరాల్‌గా కథను ఒక వర్గాన్ని కించపరిచేలా తీశారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

News March 29, 2025

అవనిగడ్డ: IPL బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు 

image

అయ్యప్ప నగర్‌లో లోకేశ్ ఆత్మహత్యతో IPL బెట్టింగ్ ముఠాల వ్యవహారం బయటపడింది. విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఈ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. దర్యాప్తులో అవనిగడ్డ MPP కుమారుడు పవన్ కుమార్ కీలక నిందితుడిగా బయటపడ్డాడు. అతడి బ్యాంక్ ఖాతాల్లో లక్షలాది రూపాయలున్నట్లు గుర్తించారు. బుకీలను పట్టుకునేందుకు పోలీసులు క్షుణ్ణంగా విచారణ కొనసాగిస్తున్నారు. 

error: Content is protected !!