News March 5, 2025

VJA: బంగారు నగల కోసం హత్య.. జీవిత ఖైదు

image

నగలు కోసం వృద్ధురాలిని హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. గుణదలకు చెందిన ఓ వృద్ధురాలిని 2014లో హత్య చేసి బంగారం చోరీ చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు తోట్లవల్లూరుకు చెందిన బుజ్జి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయగా విజయవాడ న్యాయస్థానం  జైలు శిక్ష, రూ.3వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి నాగేశ్వరావు తీర్పు చెప్పారు. 

Similar News

News November 16, 2025

పశువులకు ‘ఉల్లి’తో సమస్య.. చికిత్స ఇలా

image

ఒక రోజులో పశువు తినే మొత్తం మేతలో 5 నుంచి 10 శాతానికి మించి ఉల్లిపాయలు ఉండకూడదని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అది కూడా వారంలో 2-3 రోజులు మాత్రమే ఇవ్వాలన్నారు. ‘ఈ పరిమితి మించితే పశువుల కళ్లు, మూత్రం ఎర్రగా మారిపోతాయి. ఆహారం తీసుకోవు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుల సూచనతో విటమిన్ ఇ, సెలీనియం, ఫాస్ఫరస్ ఇంజెక్షన్లు, లివర్ టానిక్‌లు, చార్కోల్ లిక్విడ్ లాంటివి అందించాలి.

News November 16, 2025

ఏలూరు: వాహనం ఢీకొని వలస కూలీ మృతి

image

వంతెన కింద నిద్రిస్తున్న ఓ వలస కూలీని గుర్తుతెలియని వాహనం బలిగొన్న ఘటన పెదపాడు మండలం తాళ్లమూడిలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వల్లి కృష్ణమూర్తి (40) విజయరాయిలో పనుల కోసం వచ్చి, తాళ్లమూడి వంతెన కింద నిద్రిస్తుండగా వాహనం అతని పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శారదా సతీశ్ తెలిపారు.

News November 16, 2025

ఆదిలాబాద్: తీరు మారని ప్రైవేటు ట్రావెల్స్

image

రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా ప్రైవేటు ట్రావెల్స్ తీరు మాత్రం మారడం లేదు. ఆదిలాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కామాక్షి ట్రావెల్స్ బస్సు కామారెడ్డి(D) సిద్ధిరామేశ్వర్‌నగర్ శివారులో శనివారం రాత్రి హైవేపై ఏర్పాటు చేసిన డ్రమ్ములను ఢీకొట్టింది. మిర్యాలగూడకు చెందిన డ్రైవర్‌ రమేష్‌ మద్యంతాగి బస్సు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని 30 మంది ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.