News January 10, 2026

VJA: బాలికపై అఘాయిత్యం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు!

image

విజయవాడ భవానీపురం పరిధిలో బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు చింతాడ దుర్గారావుకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.4,000ల జరిమానా విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసును విచారించిన జడ్జి వేల్పుల భవాని నేరం రుజువైనట్లు పేర్కొన్నారు. బాధిత బాలికకు రూ.5 లక్షల పరిహారం అందేలా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News January 17, 2026

భక్తులకు పోలీసులు అండగా నిలవాలి: మంత్రి సీతక్క

image

మేడారంలోని వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులకు పోలీసులు ధైర్యంగా నిలిచి, వారు ప్రశాంతంగా మొక్కులు చెల్లించుకునేలా చూడాలని మంత్రి సీతక్క సూచించారు. మేడారంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించిన ఆమె.. సీసీ కెమెరాలు, డ్రోన్ల పనితీరును పరిశీలించారు. భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, ప్రతి అంశాన్ని అప్రమత్తంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

News January 17, 2026

NLG: మేయర్ పీఠం సహా 9 పురపాలికలు మహిళలకే

image

ఉమ్మడి జిల్లాలో మేయర్ పీఠంతో పాటు 9 పురపాలికల ఛైర్‌పర్సన్ స్థానాలు మహిళలకే దక్కాయి. ఎస్సీలకు రెండు, బీసీలకు 3, జనరల్ 7, జనరల్ మహిళలకు 7 స్థానాలకు రిజర్వు చేశారు. బీసీలకు రిజర్వు చేసిన మూడింటిలో ఒక్కటి మాత్రమే జనరల్ కాగా రెండు మున్సిపాలిటీలు మహిళలకే రిజర్వు చేయడం విశేషం.

News January 17, 2026

చిత్తూరు: వేంకన్నా.. రైతుల కష్టాలు వినవన్నా.!

image

<<18883864>>బకాయిల<<>> చెల్లింపులో మామిడి పల్ప్ ఫ్యాక్టరీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని రైతులు మండిపడుతున్నారు. గతేడాది ఉమ్మడి చిత్తూరు(D)లో రైతుల నుంచి దాదాపు 2.33 లక్షల మెట్రిక్ టన్నుల పంటను సేకరించారు. KGకి ప్రభుత్వం రూ.4, కంపెనీలు రూ.8 చెల్లించేలా GOVT నిర్ణయం తీసుకుంది. చిత్తూరు-30, తిరుపతి జిల్లాలో 8 ఫ్యాక్టరీలు పంటను కొనుగోలు చేసి 8 నెలలు అవుతున్నా ఇంత వరకు బకాయిలు చెల్లించలేదట.