News April 3, 2025

VJA: మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

image

భార్య మాట వినటంలేదని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తపేట పోలీసుల కథనం మేరకు.. జక్కంపూడికి చెందిన అనిల్ కుమార్ తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య ఓ బైండింగ్ షాప్‌లో పనిచేస్తూ ఉంటుంది. భార్యను పనికి వెళ్లవద్దంటూ అనిల్ కుమార్ హెచ్చరిస్తూ ఉన్నాడు. అయినా ఆమె పనికి వెళ్లడంతో బుధవారం ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 12, 2025

కృష్ణా: ఒకేషనల్ కోర్సులో జిల్లా టాపర్‌గా గాయత్రి

image

నేడు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఒకేషనల్ కోర్సుకు సంబంధించి మచిలీపట్నం లేడి యాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన గాయత్రి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. గుడ్లవల్లేరుకు చెందిన గాయత్రి 1000కి 988 మార్కులు సాధించి జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థినిని కాలేజీ ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ సుందర లక్ష్మి అభినందించారు. 

News April 12, 2025

కృష్ణా జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిన మొవ్వ ప్రభుత్వ జూనియర్ కళాశాల 

image

ఇంటర్మీడియట్ ఫలితాల్లో మొవ్వ క్షేత్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు 87% ఉత్తీర్ణతతో జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. 83.5% ఉత్తీర్ణతతో అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాల రెండవ స్థానంలో, 79% ఉత్తీర్ణతతో మచిలీపట్నంలోని లేడి యాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మూడో స్థానంలో నిలిచింది. ఉత్తమ ఫలితాలు సాధించిన ఆయా కళాశాలల యాజమాన్యాలను ఇంటర్ బోర్డు జిల్లా అధికారి సాల్మన్ రాజు అభినందించారు.

News April 12, 2025

ఇంటర్ ఫలితాల్లో జిల్లా ఫస్ట్ ర్యాంక్ మన బందరు అమ్మాయికే 

image

నేడు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో మచిలీపట్నం లేడి యాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన ఎ.బాల త్రిపుర సుందరి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. క్యాంబెల్ పేటకు చెందిన త్రిపుర సుందరి 1000 మార్కులకు గాను 980 మార్కులు సాధించి జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఆ విద్యార్థినిని కాలేజీ ప్రిన్సిపల్ అభినందించారు.  

error: Content is protected !!