News March 8, 2025

VJA: మహిళా దినోత్సవ వారోత్సవ వేడుకల్లో హోం మంత్రి 

image

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మహిళా దినోత్సవ వారోత్సవ వేడుకల్లో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక మంది మేధావులు, ప్రముఖుల ఆధ్వర్యంలో “మహిళల నాయకత్వం-సవాళ్లు పురోగమించే మార్గం” అన్న అంశంపై ప్యానెల్ డిస్కషన్‌లో భాగస్వామ్యమయ్యారు. మహిళల అభ్యున్నతితో పాటు వారిలోని నాయకత్వ సామర్ధ్యాలను వెలికి తీయడం, వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 

Similar News

News December 10, 2025

టేకులపల్లి: లారీని ఢీకొట్టి యువకుడికి తీవ్రగాయాలు

image

టేకులపల్లి మండలంలోని బోరింగ్ తండా నుంచి టేకులపల్లి వైపు వస్తున్న బైక్ బుధవారం లారీని ఢీ కొట్టడంతో వ్యక్తికి గాయాలయ్యాయి. కొత్తగూడెం నుంచి బొగ్గు తరలిస్తున్న లారీని ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 10, 2025

WGL: కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కుతూ జారిపడి వ్యక్తి మృతి

image

వరంగల్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారం నంబర్-1పై ఖమ్మం వైపు వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కబోతూ గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. శరీరం నడుము వద్ద తెగి రెండు ముక్కలైంది. మృతుడు తెలుపు, లేత నీలిరంగు చారల షర్ట్ ధరించి ఉన్నాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు.

News December 10, 2025

NTPCలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

<>NTPC<<>> 15 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి డిసెంబర్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/ బీటెక్( ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://careers.ntpc.co.in/