News March 20, 2025
VJA: మిషన్ వాత్సల్యతో శిశు క్షేమం, సంక్షేమం: కలెక్టర్

నిస్సహాయ స్థితి, అవసరాలుగల చిన్నారుల క్షేమం, సంక్షేమం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న మిషన్ వాత్సల్యను లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఏర్పాటైన గ్రామ, వార్డుస్థాయి కమిటీలు క్రియాశీలం కావాలని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో మిషన్ వాత్సల్య – శిశు సంక్షేమ, రక్షణ జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు.
Similar News
News December 9, 2025
ASF యూత్ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్‌లు

తెలంగాణ స్టేట్ యూత్ కాంగ్రెస్ సంస్థను బలపరచేందుకు జిల్లా వారీగా అధిష్ఠానం కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. ఆసిఫాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా రవికాంత్ గౌడ్, సెక్రటరీగా అమ్ముల మధుకర్ యాదవ్‌ను నియమించినట్లు యూత్ కాంగ్రెస్ ప్రకటించింది. యువత చేరిక, బూత్ స్థాయిలో బలోపేతం లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టినట్లు తెలిపింది.
News December 9, 2025
‘అఖండ-2’ రిలీజ్‌తో 17 సినిమాలపై ఎఫెక్ట్!

బాలయ్య ‘అఖండ-2’ సినిమా ఈనెల 12న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దీంతో ఈ వారాంతంలో 14 కొత్త, 3 రీరిలీజ్ సినిమాల విడుదల ప్రశ్నార్థకంగా మారింది. ఇవి ఇప్పటికే ప్రమోషన్లు పూర్తిచేసుకున్నా.. బాక్సాఫీస్ వద్ద ‘అఖండ-2’ చూపించే ప్రభావం దృష్ట్యా విడుదలను పోస్ట్‌పోన్ చేసుకుంటున్నాయి. ‘మోగ్లీ’, ‘అన్నగారు వస్తారు’, ‘డ్రైవ్’ వంటి సినిమాల విడుదలకు బాలయ్య మూవీ పెద్ద సవాలుగా మారింది. దీనిపై మీ కామెంట్?
News December 9, 2025
MHBD: ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

తొలి దశ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జిల్లాలో తొలి దశ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ శబరీష్, అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, ఎన్నికల వ్యయ పరిశీలకులు మధుకర్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.


