News February 19, 2025

VJA: రూ.45 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల 

image

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇమామ్‌లు, మౌజమ్‌ల గౌరవ వేతనం నిమిత్తం రూ.45 కోట్ల పెండింగ్ బకాయిలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో విజయవాడ పశ్చిమ టీడీపీ నేత MS బేగ్ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ.. ముస్లిం మైనారిటీ సమాజానికి భరోసాని కల్పించే పార్టీ టీడీపీ మాత్రమే అనన్నారు. గత వైసీపీ పాలనలో ముస్లింలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 13, 2025

రబీలో మొక్కజొన్న సాగు చేస్తున్నారా?

image

రబీలో మొక్కజొన్నను నవంబరు 15లోగా విత్తుకుంటే అధిక దిగుబడులు పొందవచ్చంటున్నారు వ్యవసాయ నిపుణులు. దీని కోసం ఎకరాకు 8 కిలోల విత్తనం అవసరం. ఒక కిలో విత్తనానికి 6ml నయాంట్రానిలిప్రోల్ + థయోమిథాక్సామ్‌తో విత్తనశుద్ధి చేసుకోవాలి. దుక్కి చేసిన నేలలో 60 సెం.మీ. ఎడం ఉండునట్లు బోదెలు చేసుకోవాలి. విత్తనాన్ని మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ. దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తిన వెంటనే నీటి తడిని అందించాలి.

News November 13, 2025

నాగర్‌కర్నూల్: మటన్ ముక్క ఇరుక్కుని వృద్ధుడి మృతి

image

నాగర్‌కర్నూల్ జిల్లాలోని బొందలపల్లి విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. బుధవారం రాత్రి తాపీ మేస్త్రిలకు ఏర్పాటు చేసిన దావత్‌లో లక్ష్మయ్య(65) వెళ్లాడు. అక్కడ మటన్ తింటుండగా అకస్మాత్తుగా ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందికి గురైన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.

News November 13, 2025

మంచిర్యాల: శ్రీరాంపూర్, మందమర్రికు పురస్కారం

image

బొగ్గు నాణ్యత వారోత్సవాల్లో భాగంగా శ్రీరాంపూర్,మందమర్రి ఏరియాలు అత్యంత ప్రతిభ కనబరిచింది. సింగరేణి వ్యాప్తంగా నిర్వహించిన వారోత్సవాల్లో శ్రీరాంపూర్ ఏరియా75:17%తో 2వ స్థానం,మందమర్రి ఏరియా 71:33శాతంతో 3వ స్థానంలో నిలిచింది.ఈనెల 19న హైదరాబాద్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో ఏరియా నుంచి పురస్కారం అందుకోనున్నట్లు అధికారులు చెప్పారు.2వ,3వ స్థానంలో నిలవడంతో అధికారులు,కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.