News February 17, 2025
VJA: రేపు వల్లభనేని వంశీని కలవనున్న జగన్?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రేపు మాజీ సీఎం వైఎస్ జగన్ కలవనున్నట్లు తెలిసింది. బెంగళూరు నుంచి నేరుగా ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్ళనున్నారు. విజయవాడ సబ్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ పరామర్శించినట్లు సమాచారం. ఇటీవల వల్లభనేని వంశీ అరెస్టై రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే.
Similar News
News November 21, 2025
ధర్మారం: పిల్లల కోసం వినూత్న కార్యక్రమాలు.. సత్కారం

ధర్మారం ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ను స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ నికోలస్ ప్రత్యేకంగా పిలిచి సత్కరించారు. SEPT 2024 నుంచి ఆయన నూతన ఆలోచనలతో నాణ్యమైన విద్య, SPC, మాసపత్రిక, రేడియో FM 674.26, ప్లాస్టిక్ రహిత పాఠశాల, మీల్స్ విత్ స్టూడెంట్స్, ప్లే ఫర్ ఆల్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. విద్యార్థుల అభివృద్ధికి చేస్తున్న కృషిని గుర్తించిన కమిషనర్ రాజ్ కుమార్ను అభినందించారు.
News November 21, 2025
పెరుగుతున్న టమాటా ధరలు

దేశవ్యాప్తంగా టమాటా ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. OCT 19 నుంచి NOV 19 మధ్య KG ధర సగటున ₹36 నుంచి ₹46కు పెరిగినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అధిక వర్షపాతంతో దిగుబడి తగ్గడంతోపాటు పెళ్లిళ్ల సీజన్ కారణంగా టమాటాకు డిమాండ్ పెరిగింది. దీంతో ఇప్పటికే కొన్నిచోట్ల KG రేటు ₹80కి చేరింది. కాగా APలోని అనంతపురం(D) కక్కలపల్లి మార్కెట్లో నిన్న గరిష్ఠంగా KG రేటు రూ.50 పలికింది.
News November 21, 2025
తిరుపతి జిల్లాలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుపతి జిల్లా పర్యటన ముగిసింది. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఆమె రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. హోం మంత్రి అనిత వీడ్కోలు పలికారు. ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి హైదరాబాద్కు వెళ్లారు. కలెక్టర్ డా.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, జిల్లా ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు ముర్ముకు వీడ్కోలు పలికారు.


