News February 17, 2025

VJA: రేపు వల్లభనేని వంశీని కలవనున్న జగన్?

image

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రేపు మాజీ సీఎం వైఎస్ జగన్ కలవనున్నట్లు తెలిసింది. బెంగళూరు నుంచి నేరుగా ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్ళనున్నారు. విజయవాడ సబ్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ పరామర్శించినట్లు సమాచారం. ఇటీవల వల్లభనేని వంశీ అరెస్టై రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

Similar News

News March 25, 2025

లీటర్ పెట్రోల్‌పై రూ.17 తగ్గించాలి: షర్మిల

image

పెట్రోల్, డీజిల్ ధరలపై ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు లీటరుపై రూ.17 తగ్గించాలని APCC చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ రూ.109.60, డీజిల్ రూ.97.47గా ఉంది. TN, TGతో పోల్చినా APలో ధరలు ఎక్కువ. పెట్రోల్, డీజిల్ మీద పన్నుల తగ్గింపుపై TDP, YCP నీచ రాజకీయాలు చేస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు CBN రూ.17 తగ్గించవచ్చని చెప్పారు. ఇప్పుడు వారి హామీని నిలబెట్టుకోవాలి’ అని కోరారు.

News March 25, 2025

‘కాంట్రాక్టు కార్మికులకు GO ప్రకారం వేతనాలు ఇవ్వాలి’

image

సింగరేణి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న సెక్యూరిటీ, శానిటేషన్, స్వీపర్, స్కావెంజర్లకు ప్రభుత్వ GOప్రకారం వేతనాలు ఇవ్వాలని AITUCనాయకులు అబ్దుల్ కరీం, శనిగరపు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. వేతనాలు ఇవ్వకుండా కార్మికులను ఆర్థిక దోపిడీకి గురి చేస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. నెలకు 4 సెలవులు, పండగ అడ్వాన్స్, బోనస్, ప్లే డే, రెస్ట్ ఇవ్వాలన్నారు.

News March 25, 2025

ఏటీఎం ఛార్జీల పెరుగుదల.. ఎప్పటినుంచంటే..

image

ఈ ఏడాది మే 1 నుంచి ఏటీఎం ఛార్జీల బాదుడు పెరగనుంది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో ప్రాంతాల్లో 5సార్లు, నాన్ మెట్రో ప్రాంతాల్లో 3సార్లు ప్రతి నెలా ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు. మే 1 నుంచి ఆ పరిధి దాటితే డబ్బు విత్‌డ్రాకు ఇప్పుడున్న రూ.17 నుంచి రూ.19కి, బాలెన్స్ చెకింగ్‌కు ఇప్పుడున్న రూ.6 నుంచి రూ.7కి ఛార్జీలు పెరగనున్నాయి.

error: Content is protected !!