News February 20, 2025
VJA: ‘రోస్టర్ విధానంలోని తప్పులు సరిచేయాలి’

గ్రూప్-2లోని రోస్టర్ విధానం సవరించాలని అభ్యర్థులు బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వం గ్రూప్-2 అభ్యర్థులను పట్టించుకోలేదన్నారు. ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని చెప్పి అధికార పీఠమెక్కిన జగన్ కీలకమైన గ్రూప్-1, 2 ఉద్యోగాల నియామకాలను పక్కన పెట్టారన్నారు. ఈనెల 23న జరిగే పరీక్షకు 92,250 మంది అభ్యర్థులు సందిగ్ధంలో పడ్డారని మండిపడ్డారు. రోస్టర్ విధానంలోని తప్పులు సరిచేయాలన్నారు.
Similar News
News December 10, 2025
2వేల మంది పోలీసులతో ఎన్నికల బందోబస్త్: వరంగల్ సీపీ

రేపు జరిగే మొదటి విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా 2వేల మంది పోలీసులతో ఎన్నికల బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఇందులో డీసీపీలు ముగ్గురు, అదనపు డీసీపీలు 11 మంది, 13 మంది ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
News December 10, 2025
ఇతిహాసాలు క్విజ్ – 92 సమాధానం

ఈరోజు ప్రశ్న: గణపతి, కార్తీకేయ సోదరులను ముల్లోకాలు చుట్టిరమ్మనే పరీక్ష శివుడు ఎందుకు పెట్టాడు?
సమాధానం: ప్రమథగణాలకు నాయకత్వం వహించడానికి అర్హులెవరో నిర్ణయించడానికి శివుడు ఈ పరీక్ష పెట్టాడు. కార్తికేయుడు లోకాలు చుట్టడానికి వెళ్లగా, గణపతి శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేసి తల్లిదండ్రులే సకల లోకాలు అని నిరూపించాడు. అలా వినాయకుడు సకల కార్యాలలో తొలి పూజలు అందుకునే వరాన్ని అనుగ్రహించాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 10, 2025
దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్లోనే టిడ్కో ఇళ్లు: కలెక్టర్

జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు టిడ్కో ఇళ్లు గ్రౌండ్ ఫ్లోర్లోనే మంజూరయ్యేలా చూస్తామని కలెక్టర్ కృతిక శుక్లా అన్నారు. ఎవరికీ మంజూరు చేయని ఇళ్లలో వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. దివ్యాంగుల క్రీడా పోటీలను ప్రారంభించి, మాట్లాడిన ఆమె.. క్రీడల్లో రాణించిన వారికి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.


