News December 17, 2024
VJA: వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని YCP నేతలకు మంగళవారం భారీ ఊరట లభించింది. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఉన్న వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రి జోగి రమేష్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఫిబ్రవరి వరకు ఇరువురిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. జోగి రమేష్ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులోనూ ముద్దాయిగా ఉన్నారు.
Similar News
News January 21, 2025
ఎస్పీని కలిసిన అవనిగడ్డ నూతన డీఎస్పీ విద్యశ్రీ
అవనిగడ్డ సబ్ డివిజనల్ పోలీస్ అధికారిణిగా బాధ్యతలు చేపట్టిన తాళ్లూరి విద్యశ్రీ సోమవారం కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర రావును మచిలీపట్నం ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి డీఎస్పీ పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అవనిగడ్డ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి సూచించారు.
News January 20, 2025
విజయవాడ: పీజీఆర్ఎస్‌కు 92 ఫిర్యాదులు
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి 92 ఫిర్యాదులు వచ్చాయని డీసీపీ ఏబీటీఎస్. ఉదయారాణి తెలిపారు. ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం త్వరితగతిన పరిష్కరించాలని ఫోన్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓలతో మాట్లాడి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
News January 20, 2025
‘కుష్టు’ వ్యాధిని సమూలంగా నిర్మూలిద్దాం: కలెక్టర్
కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా ఈనెల 20 నుంచి పిబ్రవరి 2వ తేది వరకు జిల్లాలో కుష్టు వ్యాధి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకిని ‘కుష్టు’ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సోమవారం విజయవాడ కలెక్టరేట్‌లో కుష్టు వ్యాధి పరీక్షలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.