News March 30, 2025
VJA: శరవేగంగా విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనులు రానున్న 3 నెలల్లో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రూ.540 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన ఈ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని గుత్తేదారుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కూచిపూడి, అమరావతి థీమ్తో రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ టెర్మినల్ నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Similar News
News October 27, 2025
ASF: ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. సోమవారం ASF కలెక్టరేట్ భవన సముదాయంలో గల జీ 1 కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.
News October 27, 2025
ఆయుధాలపై విద్యార్థులకు ఎస్పీ అవగాహన

పోలీసులు వినియోగించే ఆయుధాలు, సాధనాల పట్ల విద్యార్దులు అవగాహన కల్గి ఉండటం మంచిదని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా డీపీఓలో ఏర్పాటుచేసిన పోలీస్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని విద్యార్థులతో కలిసి ఎస్పీ పరిశీలించారు. పోలీసు అమర వీరులను ప్రతి ఒక్కరం స్మరించుకుందాం అన్నారు. ప్రజల్లో పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంపొందించామన్నారు.
News October 27, 2025
కామారెడ్డి: ప్రజావాణిలో 106 దరఖాస్తులు

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో వివిధ మండలాల దరఖాస్తుదారుల నుండి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అర్జీలను స్వీకరించారు. అనంతరం, వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా శాఖలకు మొత్తం 106 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.


