News March 30, 2025

VJA: శరవేగంగా విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ పనులు

image

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనులు రానున్న 3 నెలల్లో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రూ.540 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన ఈ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని గుత్తేదారుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కూచిపూడి, అమరావతి థీమ్‌తో రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ టెర్మినల్ నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Similar News

News April 21, 2025

ఎచ్చెర్ల: డిగ్రీ ఆరవ సెమిస్టర్ ఇంటర్న్‌షిప్ ఫలితాలు విడుదల

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ఆరవ సెమిస్టర్ ఇంటర్న్‌షిప్ ఫలితాలను నేడు యూనివర్సిటీ డీన్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ..ఈ ఫలితాలను https://jnanabhumi.ap.gov.in/ వెబ్ సైట్‌లో చూడాలని చెప్పారు. డిగ్రీ రెండవ సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 24వ తేదీ నుంచి జరుగుతాయని తెలిపారు.

News April 21, 2025

బీటెక్, MBA చేసినా నిరుద్యోగులుగానే!

image

భారతదేశంలో గ్రాడ్యుయేట్ల పరిస్థితిపై ‘అన్‌స్టాప్’ నివేదిక విడుదల చేసింది. దాదాపు 83% మంది ఇంజినీరింగ్ విద్యార్థులు, 50శాతం మంది MBA గ్రాడ్యుయేట్లు ఎలాంటి ఉద్యోగం, ఇంటర్న్‌షిప్ పొందలేదని తెలిపింది. 2024లో ఇంటర్న్‌షిప్ పొందిన వారిలోనూ నలుగురిలో ఒకరిని ఫ్రీగా పనిచేయించుకున్నట్లు పేర్కొంది. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే విధంగా విద్యా సంస్థలు కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

News April 21, 2025

జగిత్యాల: పోలీసు గ్రీవెన్స్‌కు 13 ఫిర్యాదులు

image

జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో నేడు గ్రీవెన్స్‌డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్పీ అశోక్ కుమార్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 13 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, సమస్యల పూర్తి వివరాలను సమర్పించాలన్నారు. ప్రతి కేసుపై విచారణ జరిపి తగినచర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.

error: Content is protected !!