News March 20, 2025

VJA: సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలి: కలెక్టర్

image

విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలో గురువారం దాతలు ఏర్పాటు చేసిన ఉచిత తాగునీటి ఆర్వో ప్లాంట్‌, వైద్య శిబిరాలను ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజల దాహర్తి తీర్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. సేవా కార్యక్రమాలకు దాతలు ముందుకు రావాలని కలెక్టర్ కోరారు.

Similar News

News December 22, 2025

కూతురు గొప్పా? కోడలు గొప్పా?

image

మన ధర్మం ప్రకారం కోడలే ఇంటికి గృహలక్ష్మి. పుట్టినింటిని వదిలి, మెట్టినింటి గౌరవం కోసం పేరును, జీవితాన్ని అంకితం చేసే త్యాగశీలి ఆమె. భర్తను ప్రేమగా చూసుకుంటూ అందరికీ అమ్మలా అన్నం పెట్టే గుణశీలి. పితృదేవతలు మెచ్చేలా వంశాన్ని ఉద్ధరించే శక్తి కోడలికే ఉంది. ఏ ఇంట కోడలిని గౌరవించి, లక్ష్మిగా భావిస్తారో ఆ ఇల్లు సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. ఈ ఇంటి కూతురు మెట్టినింటి కోడలిగా వారి అభ్యున్నతికి కారణమవుతుంది.

News December 22, 2025

జగిత్యాల జిల్లాలో 12 నూతన సొసైటీల ఏర్పాటుకు ప్రతిపాదన

image

జగిత్యాల జిల్లాలో మొత్తం 51 Pacsలు ఉండగా, 1.5 లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. అయితే జిల్లాలో 12 కొత్త సొసైటీలను ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. ఇందులో జిల్లాలోని మోరపల్లి, పోరండ్ల, లక్ష్మీపూర్, మద్దులపల్లి, రాపల్లి, వర్తకొండ, జగ్గసాగర్, కొత్త దాంరాజ్పల్లి, బుగ్గారం, మన్నెగూడెం, అంబారిపేట, కట్కాపూర్‌లో ట్రైబల్ సొసైటీ ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదించారు.

News December 22, 2025

నిద్ర పట్టట్లేదా? మీ సమస్య ఇదే కావొచ్చు!

image

నిద్రలేమి సమస్యలకు కెఫిన్ కారణం కావొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల 10-20% దీర్ఘకాలిక నిద్ర సమస్యలొస్తున్నట్లు చెబుతున్నారు. ‘కెఫిన్‌ను జీర్ణం చేసుకునే సామర్థ్యం లేకపోతే నిద్రపట్టదు. అలాంటివారు పడుకోడానికి 6-8 గంటల ముందే కాఫీ, టీ, చాక్లెట్ వంటివి తీసుకోవద్దు. అయినా తగ్గకపోతే పూర్తిగా కెఫిన్ తీసుకోవడం మానేయాలి. కొన్నిరోజుల్లో మార్పు కనిపిస్తుంది’ అని తెలిపారు.
SHARE IT