News August 29, 2024
VJA: హీరోయిన్ కేసు దర్యాప్తులో మరో ముందడుగు
ముంబై హీరోయిన్ జెత్వానీ కేసుపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆమెతో ఆన్‍లైన్‍లో ఫిర్యాదు తీసుకోవాలని అధికారులు తెలిపారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తు అధికారిగా విజయవాడ సీసీఎస్ ఎసీపీ స్రవంతి రాయ్‌ను నియమిస్తున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. ప్రతి అంశాన్ని క్షుణంగా దర్యాప్తు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News September 15, 2024
కృష్ణా: వరద బాధితులకు రూ.7.70 కోట్ల విరాళం
వరద బాధితులకు ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున రూ.7.70 కోట్ల విరాళం అందజేశామని పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు YVB రాజేంద్ర తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు విరాళం చెక్‌ను డిప్యూటీ సీఎం పవన్‌కు అందజేశామని YVB తెలిపారు. వరద బాధితులకై రాష్ట్రంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఒక నెల గౌరవ వేతనం ఇచ్చారని ఆ మొత్తం రూ.7.70 కోట్లు అవ్వగా, ఆ నగదు ప్రభుత్వానికి ఇచ్చామన్నారు.
News September 15, 2024
విజయవాడ: అధికారులపై సస్పెన్షన్ వేటు
ముంబై సినీ నటి కాదంబరి కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, అప్పటి విజయవాడ సీపీ కాంతి రాణా, పోలీస్ అధికారి విశాల్‌గున్నిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ వర్గాల నుంచి ఉత్వర్వులు తాజాగా వెలువడ్డాయి. కాగా ఈ కేసులో ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇటీవల సస్పెండ్ చేశారు.
News September 15, 2024
తిరువూరులో చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి
తిరువూరులోని పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. కూలీ పని నిమిత్తం చెట్టు ఎక్కి కొమ్మలను నరికే ప్రయత్నం చేయగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కింద పడ్డాడు. ఈక్రమంలో గేటుకి ఉన్న స్తూపం దిగబడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మునకుళ్ల గ్రామానికి చెందిన శ్రీకాకుళపు నాగేశ్వరరావు (45)గా గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.