News December 17, 2024
VJA: హైకోర్టులో డిప్యూటీ సీఎంపై పిటిషన్ దాఖలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కేసు పునర్విచారణకు హైకోర్టులో మహిళా వాలంటీర్ల తరఫున వ్యాజ్యం దాఖలయింది. ఈ పిటీషన్ను హైకోర్ట్ సీనియర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ మంగళవారం దాఖలు చేశారు. గతంలో వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదయింది. అయితే కూటమి ప్రభుత్వం కేసును ఉపసంహరించుకోవడంపై హైకోర్టులో క్రిమినల్ రివిజన్ ఇద్దరు మహిళా వాలంటర్లు పిటిషన్ దాఖలు చేశారు.
Similar News
News November 21, 2025
ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలి: కలెక్టర్

ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఎంప్లాయిస్ గ్రీవెన్స్ నిర్వహించారు. పలువురు ఉద్యోగుల నుండి స్వయంగా అర్జీలు స్వీకరించారు. ఉద్యోగుల సమస్యలను ఆలకించి పరిష్కారంపై సంబంధిత అధికారులతో మాట్లాడారు.
News November 21, 2025
హనుమాన్ జంక్షన్: విద్యార్థినులకు వేధిస్తున్న ఆకతాయిల అరెస్ట్

హనుమాన్ జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్ పరిధిలో ఆకతాయిల హంగామా సృష్టించారు. ద్విచక్ర వాహనాలపై ఆర్టీసీ ఆవరణలో తిరుగుతూ కాలేజీ విద్యార్థినులతో అసభ్యకరంగా, ఎగతాళిగా మాట్లాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంటనే స్పందించిన జంక్షన్ పోలీసులు ఆకతాయిలను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
News November 21, 2025
MTM: గోనె సంచుల నాణ్యతను పరిశీలించిన కలెక్టర్

ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి గోనె సంచుల కొరత లేకుండా జాగ్రత్తపడాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బందరు మండలం భోగిరెడ్డిపల్లిలో పర్యటించిన ఆయన రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. గోనె సంచుల లభ్యత, నాణ్యతను పరిశీలించారు. అంతక ముందు గ్రామంలో ఇటీవల నిర్మించిన పంచాయతీ రాజ్ రోడ్లను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.


