News October 10, 2025
VJA: అమ్మవారిని దర్శించుకున్న హీరో ఆకాశ్ పూరి

ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని గురువారం రాత్రి సినీ హీరో ఆకాష్ పూరి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం చేయించిన అనంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై ఉన్న శివాలయాన్ని కూడా దర్శించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు అభిమానులు ఆయనతో ఫొటోలు దిగారు.
Similar News
News October 10, 2025
పొత్తుపై EPS వ్యాఖ్యలు.. ఖండించిన TVK

విజయ్ పార్టీ TVKతో పొత్తుపై AIADMK నేత E.పళనిస్వామి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. TNలో ఎన్డీయే కూటమి కోసం ఇప్పటికే పని ప్రారంభమైందని చెప్పారు. నమక్కల్ జిల్లాలో తన ప్రచారంలో కొందరు TVK జెండాలను ఊపడంపై ఆయన స్పందిస్తూ ‘చర్యలు మొదలయ్యాయి. ఇది విప్లవ ధ్వని. ఈ శబ్దాన్ని మీరు (DMK) తట్టుకోలేరు’ అని అన్నారు. పొత్తులు తప్పనిసరని, తమ కూటమి మరింత బలపడుతుందని చెప్పారు. అయితే పళని వ్యాఖ్యలను టీవీకే ఖండించింది.
News October 10, 2025
పసికందు మృతి.. బాధ్యులపై కఠిన చర్యలు

అనంతపురంలోని శిశు గృహంలో పసికందు మృతి ఘటనకు బాధ్యులపై కలెక్టర్ ఓ.ఆనంద్ తీవ్ర చర్యలకు ఉపక్రమిస్తున్నారు. నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంపై డీసీపీఓ, మేనేజర్, సోషల్ వర్కర్‌తో పాటు ఐదుగురు ఆయాలకు నోటీసులు జారీ చేశారు. వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు దస్త్రం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో ఐసీడీఎస్ పీడీ నాగమణి సస్పెండ్ కాగా డీసీవో అరుణకుమారి ఇన్‌ఛార్జి పీడీగా నియమితులయ్యారు.
News October 10, 2025
నిజాంసాగర్ ప్రాజెక్టు 5 గేట్ల నుంచి నీటి విడుదల

నిజాంసాగర్ ప్రాజెక్టుకు మళ్లీ వరద ఉద్ధృతి పెరిగింది. శుక్రవారం ఉదయం 41,680 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు 5 వరద గేట్లను ఎత్తి 40,680 క్యూసెక్కుల నీటిని మంజీరాకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17.802 టీఎంసీలతో నిండుకుండలా మారింది. మరో వెయ్యి క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు ప్రధాన కాలువకు విడుదల కొనసాగుతోంది.