News January 1, 2026
VJA: అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు సిట్టింగ్ జడ్జి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ టి.సి.డి. శేఖర్ గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.
Similar News
News January 3, 2026
KNR: నేడు జిల్లాల్లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజును ‘మహిళా ఉపాధ్యాయ దినోత్సవం’గా నిర్వహిస్తూ జిల్లా స్థాయిలో ఘనంగా వేడుకలు జరపాలని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఇ.నవీన్ నికోలస్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీచేశారు. ప్రతిజిల్లాలో విద్యారంగంలో విశేష సేవలందించిన 10మంది ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను ఎంపిక చేసి ప్రభుత్వం సత్కరించనుంది.
News January 3, 2026
అనకాపల్లి జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

అనకాపల్లి జిల్లాలో 83 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. కేజీబీవీ టైప్-3 విభాగంలో 20, టైప్-4 విభాగంలో 63 పోస్టులకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి జనవరి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
News January 3, 2026
ఏలూరు జిల్లా కస్తూర్బా స్కూళ్లలో ఉద్యోగాలు

కాకినాడ జిల్లాలో 2 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. టైప్ – 3 కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. నేటి నుంచి జనవరి 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. టెన్త్ పాసైన మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.


