News January 1, 2026

VJA: అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

image

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు, పాలకమండలి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా క్యూలైన్లు, భద్రత, తాగునీరు, తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు.

Similar News

News January 1, 2026

రహదారి నిబంధనలను విధిగా పాటించాలి : కలెక్టర్

image

రహదారిపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రహదారి నిబంధనలు పాటించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను ప్రారంభించి, గోడ పత్రికలు, కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాల్లో 90 శాతం వరకు నిబంధనలు పాటించకపోవడమే కారణమని తెలిపారు. వాహనాలను జాగ్రత్తగా నడిపితే ప్రమాదాలను చాలా వరకు అరికట్టవచ్చన్నారు.

News January 1, 2026

కర్రపెండలంలో జింక్ లోప లక్షణాలు – నివారణ

image

కర్రపెండలంలో మొక్కలో జింక్ లోపం వల్ల ఆకులు సన్నగా, పసుపుగా మారి పైకి వంకరగా ఉంటాయి. పెరుగుతున్న లేత మొక్క భాగంపై ప్రభావం ఎక్కువగా ఉండి, పెరుగుదల తగ్గుతుంది. లేత ఆకులలో ఈనెల ముఖ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది. లోప నివారణకు 5KGల జింక్ సల్ఫేట్ భూమిలో వేసి కప్పాలి. 1-2% జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని 3-4 సార్లు పిచికారీ చేయాలి. ముచ్చెలను 2-4% జింక్ సల్ఫేట్ ద్రావణంలో 15 నిమిషాలు ముంచిన తర్వాత నాటుకోవాలి.

News January 1, 2026

విశాఖలో మందుబాబుల తాట తీసిన పోలీసులు

image

విశాఖలో పోలీసులు కొత్త సంవత్సరం వేళ మందుబాబులపై గురిపెట్టి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు 50చోట్ల ట్రాఫిక్ పోలీసులు బృందాలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 240 మంది మద్యం సేవించినట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. వెంటనే వాహనాలు స్వాధీనం చేసుకొని స్టేషన్లకు తరలించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇవాళ కూడా తనిఖీలు జరుగుతాయన్నారు.