News March 12, 2025

VJA: అలర్ట్.. అనంతపురం వరకే నడవనున్న ఆ రైళ్లు

image

విజయవాడ మీదుగా ప్రయాణించే మచిలీపట్నం(MTM)-ధర్మవరం(DMM) రైళ్లు కొద్ది రోజుల పాటు అనంతపురం వరకే నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ధర్మవరం స్టేషనులో 5వ నం. ఫ్లాట్‌ఫామ్‌పై పనులు జరుగుతున్నందున, ఈనెల 12 నుంచి 30 వరకు నం.17215 MTM-DMM రైలు, అదే విధంగా ఈ నెల 13 నుంచి 31 వరకు నం.17216 DMM- MTM రైలు అనంతపురం వరకే నడుస్తాయన్నారు. 

Similar News

News November 12, 2025

87% బిల్లులు డిజిటల్‌తోనే: ఖమ్మం ఎస్ఈ

image

TGNPDCL డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తేవడంతో, వినియోగదారులు ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం 87% మంది టీజీఎన్‌పీడీసీఎల్ యాప్, గూగుల్ పే వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారానే బిల్లులు చెల్లిస్తున్నారని ఖమ్మం ఎస్ఈ శ్రీనివాస చారి తెలిపారు. తద్వారా కౌంటర్లకు వెళ్లే శ్రమ లేకుండా, సురక్షితంగా బిల్లులు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు.

News November 12, 2025

దివ్యాంగులకు ప్రభుత్వ సహకారం: కలెక్టర్ నాగరాణి

image

ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులను ఎంతో ఓర్పుతో సాకాల్సి ఉంటుందని కలెక్టర్ నాగరాణి అన్నారు. వారి ఇబ్బందులకు ఎల్లప్పుడూ ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని, ధైర్యంగా ఉండాలని ఆమె భరోసా ఇచ్చారు. భీమవరంలో గాలి రామయ్య మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న ‘భవిత విలీన విద్య వనరుల కేంద్రాన్ని సందర్శించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ బాలికలకు ఉచిత ఉపకరణాల పంపిణీ, వైద్య నిర్ధారణ శిబిరాన్ని పరిశీలించారు.

News November 12, 2025

ఉగాదికి మరో 5.90 లక్షల ఇళ్ల నిర్మాణం: సీఎం

image

AP: వచ్చే ఉగాదికి మరో 5.90 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల కుటుంబాలు గృహప్రవేశాలు చేశాయని పేర్కొన్నారు. తాను అన్నమయ్య జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నానని ట్వీట్ చేశారు. ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు.. ఒక కుటుంబానికి గౌరవం, సంతోషం, భవిష్యత్, భద్రత అని నమ్మి పాలన అందిస్తున్నామన్నారు.