News July 6, 2025

VJA: ఆదిత్య ఫార్మసీ ఎండీ ఆత్మహత్య ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు

image

ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహరాజు నిన్న విజయవాడలోని క్షత్రియ భవన్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఉదయం వాకింగ్‌కు వెళ్తానని చెప్పి సూసైడ్ లెటర్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. తన భర్త మరణానికి బుద్దిరాజు శివాజీ, పిన్నమనేని పరంధామయ్యలే కారణమని భార్య శాంతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News July 6, 2025

సింహాచలం గిరిప్రదక్షిణ: పార్కింగ్ స్థలాలు ఇవే-1

image

తొలి పావంచా వద్దకు వచ్చే వారి వాహనాలు అడవివరం జంక్షన్, సింహపురి కాలనీ RTC స్థలం, GVMC పార్క్, VMRDA స్థలాల్లో పార్కింగ్ చెయ్యాలి. హనుమంతవాక వైపు నుంచి వచ్చే భక్తులు ఆదర్శనగర్, డైరీ ఫారం జంక్షన్, టి.ఐ.సి పాయింట్, ఆరిలోవ లాస్ట్ బస్సు స్టాప్ మీదుగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, డంపింగ్ యార్డ్ జంక్షన్ వద్ద వాహనాలను పార్క్ చేయాలి అనంతరం దేవస్థానం ఉచిత బస్సుల్లో అడవివరం న్యూ టోల్గేట్ వద్దకు చేరుకోవాలి.

News July 6, 2025

ముఖ్యమంత్రి పర్యటనను జయప్రదం చేయండి: కలెక్టర్

image

ఈనెల 10వ తేదీ కొత్తచెరువులో జరిగే సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనను జయప్రదం చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టి.ఎస్ చేతన్ పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జిల్లా ఎస్పీ రత్నతో కలిసి కొత్తచెరువులో మాట్లాడుతూ.. మెగా PTM 2.0 కార్యక్రమంలో సీఎం పాల్గొనే అవకాశం ఉందన్నారు. అధికారులు అందరూ అప్రమత్తంగా ఉంటూ ప్రణాళికబద్ధంగా కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు.

News July 6, 2025

ప్రైవేట్ పాఠశాలల్లోనూ నిర్వహించాలి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో జులై 10న పండగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్-పీటీఎం 2.0 సమావేశం నిర్వహిస్తున్నట్లుగా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. గతంలో కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితమైన సమావేశాలు ఈసారి ప్రైవేట్ పాఠశాలల్లో కూడా నిర్వహించాలన్నారు. పిల్లలలోని సృజనాత్మకతను వెలికి తీసే విధంగా పలు పోటీలు జరుగుతాయన్నారు.