News February 5, 2025
VJA: ‘ఆపదలో ఈ నంబర్లకు ఫోన్ చేయండి’

జక్కంపూడి YSR కాలనీలోని ZP హైస్కూల్ విద్యార్థులకు పోలీసులు బుధవారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ లత కుమారి పాల్గొన్నారు. వ్యక్తిగత ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని సూచించారు. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్, ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్లు 1930, 112 తదితర అంశాలపై ఆమె విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళలు, బాలల రక్షణకు అమలవుతున్న పలు చట్టాల గురించి వివరించారు.
Similar News
News March 12, 2025
పోసాని విడుదలకు బ్రేక్!

AP: వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి విడుదలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆయన కోసం గుంటూరు సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లి పీటీ వారెంట్ వేశారు. దీంతో ఆయన్ను వర్చువల్‌గా జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. కాగా, పోసానిపై నమోదైన కేసుల్లో బెయిల్ రాగా నేడు విడుదల అవుతారని వార్తలొచ్చాయి. తాజాగా సీఐడీ పీటీ వారెంట్ దాఖలుతో విడుదల నిలిచిపోనున్నట్లు సమాచారం.
News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. సిద్దిపేట జిల్లాకు ఇవి కావాలి..?

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మరి సిద్దిపేటకు నిధులు కేటాయిస్తారా.. చూడాలి. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టూరిజం స్పాట్ శిల్పారామం రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ వద్ద బీచ్, ప్రభుత్వ వైద్య, నర్సింగ్, పశువుల వైద్య కాలేజీల్లో పెండింగ్ పనులతో పాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రంగనాయక సాగర్ డ్యాం వద్ద ఎల్లమ్మ గుడి వద్ద బ్రిడ్జి పనులు పూర్తి చేయాలి. యువతకు ఉపాధి కల్పించాలి.
News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. భువనగిరి జిల్లాకు ఇవి కావాలి..?

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భువనగిరి జిల్లాలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. చిన్నేటి వాగులపై చెక్ డ్యాంల నిర్మాణం, భువనగిరిలో ఐటీ హబ్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధులు, భువనగిరి మెడికల్ కళాశాలకు ప్లేస్ కేటాయింపు, రోడ్ల మరమ్మత్తులకు నిధులు కేటాయించాలంటున్నారు.