News January 24, 2026
VJA: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. బాలుడి ఇంటికి వెళ్లిన బాలిక

సోషల్ మీడియా పరిచయాలు యువతను పెడదారి పట్టిస్తున్నాయి. ప్రసాదంపాడుకు చెందిన ఓ బాలికను ఈ నెల 21న తల్లి మందలించడంతో, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన పామర్రుకు చెందిన బాలుడి ఇంటికి వెళ్లిపోయింది. అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నానని చెప్పి నేరుగా బాలుడి వద్దకు వెళ్లడంతో అతని కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. బాధ్యతగా వ్యవహరించిన బాలుడి కుటుంబీకులు వెంటనే బాలికను పటమట పోలీసులకు అప్పగించారు.
Similar News
News January 28, 2026
నంద్యాల జిల్లా MPTC కిడ్నాప్!

నంద్యాల జిల్లా జూపాడు బంగ్లాకు చెందిన MPTC సంటిగారి కృపాకర్ నరసరావుపేటలో కిడ్నాప్‌కు గురయ్యారు. జూపాడు బంగ్లా ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఎంపీటీసీలంతా నరసరావుపేటలో ఒక అతిథి గృహంలో బస చేశారు. మంగళవారం రాత్రి కొందరు వచ్చి కృపాకర్‌ను బలవంతంగా తీసుకెళ్లినట్లు సమాచారం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నరసరావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
News January 28, 2026
నెల్లూరు: పైసలివ్వందే.. పని ముట్టరు!

కరెంటోళ్లు మామూలోల్లు కాదు.. గ్రామాల్లో వారు చెప్పిందే వేదం. ఎప్పుడొస్తే అప్పుడే పని. అప్పటివరకు ప్రమాదమైనా అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిందే. పని చేస్తే వాళ్లు అడిగినంత ఇవ్వాల్సిందే. లేకుంటే తిరిగి ముఖం కూడా చూడరు. మరోవైపు 247 మంది లైన్‌మెన్లకు కేవలం 50 మంది మాత్రమే ఉండడం వీరికి డిమాండ్ పెరిగింది. ఇంత కొరత ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయకపోవడం గమనార్హం.
News January 28, 2026
NTR: అమరావతికి రూ. 100 కోట్లతో ‘న్యూ ఇండియా అష్యూరెన్స్’

రాజధాని ప్రాంతంలో భారీ పెట్టుబడితో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ రంగ ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ముందుకొచ్చింది. ఈ మేరకు బుధవారం సీఆర్డీఏ అధికారులు, ఆ సంస్థ చీఫ్ రీజినల్ మేనేజర్ రాజా మధ్య భూకేటాయింపు ఒప్పందం పూర్తయింది. రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ కార్యాలయం ద్వారా 200 మందికి పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని రాజా తెలిపారు.


