News August 27, 2025

VJA: ఎఫ్ఎం రేడియో నుంచి త్వరలో ట్రాఫిక్ అప్డేట్స్

image

విజయవాడ ప్రజలకు త్వరలో ఎఫ్ఎం రేడియో స్టేషన్‌లో ట్రాఫిక్ అప్డేట్స్ రాబోతున్నాయి. నగర పరిధిలో ప్రధానంగా ఉదయం, సాయంత్రం వేళ ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎఫ్ఎం రేడియోలో ట్రాఫిక్ అప్డేట్స్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. తద్వారా వాహనదారుల ప్రయాణం సులభంగా, వేగవంతంగా జరుగుతుందన్నారు. ఎఫ్ఎం ఆన్ చేసుకుంటే మీరు భద్రంగా మీ ఇంటికి చేరవచ్చని అధికారులు అంటున్నారు.

Similar News

News August 27, 2025

వర్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన

image

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలకు అలుగులు పొంగుతున్నాయి. ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. హైదరాబాద్‌లోని నీరు నిలిచే ప్రాంతాల వద్ద జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News August 27, 2025

వరంగల్: ఆ గ్రామంలో ఒకే గణేశుడు!

image

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం శివాజీనగర్ గ్రామంలో 350 నుంచి 400 జనాభా ఉంటారు. వినాయక చవితి వచ్చిందంటే ఊరంతా ఒకే మాట.. ఓకే బాటగా నిలుస్తారు. రాజకీయాలకు అతీతంగా, ఐకమత్యంగా వినాయక యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఒకే వినాయకుడిని ఏర్పాటు చేసుకొని, ఒకే చోట పూజల చేస్తారు. దీంతో గ్రామ ప్రజలను పలువురు అభినందిస్తున్నారు. మీ గ్రామంలో ఎన్ని విగ్రహాలను ప్రతిష్ఠించారో కామెంట్ చేయండి.

News August 27, 2025

తిరుపతి-ఆదిలాబాద్ కృష్ణ ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు

image

తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్లే కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలు దారి మళ్లించినట్టు దక్షిణ మధ్య రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మధ్య భారీ వర్షాలతో రైల్వే పట్టాలు ధ్వంసం కావడంతో రైలును వరంగల్ నుంచి పెద్దపల్లి, కరీంనగర్, ఆర్మూర్ మీదుగా నిజామాబాద్‌కు మళ్లించినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది.