News August 27, 2025
VJA: ఒక్క క్లిక్‌తో దోచేస్తున్న సైబర్ కేటుగాళ్లు

అజిత్‌సింగ్‌నగర్ PS పరిధిలోని నందమూరినగర్‌కు చెందిన ఓ యువకుడు సైబర్ మోసానికి గురయ్యాడు. ఈ నెల 22న అతనికి వాట్సాప్‌లో ఒక ఈ-చలాన్ లింక్ వచ్చింది. ఆ లింక్‌ను క్లిక్ చేయడంతో అతని క్రెడిట్ కార్డు నుంచి 3 విడతల్లో మొత్తం రూ47,097, రూ.65,777 నగదు కట్ అయ్యాయి. దీంతో అతను వెంటనే తన కార్డును బ్లాక్ చేయించాడు. లింక్ క్లిక్ చేయడం వల్ల అతని ఫోన్ సైబర్ కేటుగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు.
Similar News
News August 27, 2025
అమరావతిలో అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీ?

అమరావతిలో భారతదేశంలోనే అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నారు. ఇది 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన జ్ఞాన కేంద్రంగా రూపొందించనున్నట్లు తెలుస్తుంది. ఈ లైబ్రరీని నిర్మించడానికి ఒక ప్రముఖ వ్యాపార దిగ్గజం ₹100 కోట్లు విరాళంగా ఇవ్వనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.
News August 27, 2025
ప్రకాశం ఎస్పీ కార్యాలయంలో వినాయక చవితి పూజలు.!

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ దామోదర్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పూజలు చేశారు. అనంతరం పోలీస్ సిబ్బందికి ప్రసాదాన్ని ఎస్పీ అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News August 27, 2025
NRPT: జాతీయ స్థాయి క్రీడాకారుల పేర్లు నమోదు చేసుకోండి

జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న విద్యార్థుల పేర్లను నమోదు చేసుకోవాలని నారాయణపేట జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకటేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం సాయంత్రం 6 గంటలలోపు పీఈటీలు క్రీడాకారుల వివరాలను 94904 09900 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపాలని ఆయన కోరారు. క్రీడా దినోత్సవం రోజున క్రీడాకారులకు, పీఈటీలకు కలెక్టర్ చేతుల మీదుగా సన్మానం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.