News December 21, 2025
VJA: ‘కథ మళ్లీ మొదలైంది’ గ్రంథావిష్కరణ

విజయవాడలోని కే-హోటల్‌లో ‘కథ మళ్లీ మొదలైంది’ పుస్తకావిష్కరణ ఆదివారం ఘనంగా జరిగింది. శ్రీ కంఠస్ఫూర్తి సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాహిత్యంపై ఆయన ఆసక్తికర ప్రసంగం చేశారు. పలువురు ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకలో పుస్తక రచయితను, నిర్వాహకులను అభినందించారు.
Similar News
News December 22, 2025
విద్యుత్ ఉద్యోగులకు 17.6% డీఏ

TG: విద్యుత్ ఉద్యోగులకు 17.6% DA ఖరారైంది. ఉన్నతాధికారుల ప్రతిపాదనలకు Dy.CM భట్టి విక్రమార్క ఆమోదం తెలిపారు. ఇది ఈ ఏడాది జులై 1 నుంచే వర్తించనుంది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో విద్యుత్ సంస్థల పరిధిలోని 71,387 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.
News December 22, 2025
పాలన వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

పంచాయతీ ఎన్నికలు ముగిసినందున పాలన వ్యవహారాలపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలను నిబద్దతతో ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో మండల ప్రత్యేక అధికారులుగా కీలకపాత్ర పోషించిన అధికారులకు కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
News December 22, 2025
అనంతపురం: ఉద్యోగాలను సొంతం చేసుకోండి..!

అనంతపురంలోని SSBN డిగ్రీ కళాశాలలో ఈనెల 26న ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సోమవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అడ్మిట్ కార్డుతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని తెలిపారు. అభ్యర్థులు 10th ఆపై చదివి, 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలన్నారు.


