News April 25, 2025

VJA: కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

image

హౌరా-చెన్నై మధ్య నడిచే కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో కార్గో బోగి రైల్వే చక్రాలు దగ్గర మంటలు చెలరేగాయి. శుక్రవారం ఉదయం తేలప్రోలు దగ్గర మంటలు రావడంతో లోకో పైలట్ అప్రమత్తమై ట్రైన్‌ను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తేలప్రోలు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. లోకో పైలట్ మంటలను ఆర్పి వేశారు. అనంతరం ట్రైన్ విజయవాడ వైపు కదిలింది.

Similar News

News December 15, 2025

పాలమూరు: స్కేల్‌తో కొలిచారు.. విజేతను ప్రకటించారు!

image

మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం గూడూరులో కౌంటింగ్‌లో ఉత్కంఠ నెలకొంది. తొలుత కాంగ్రెస్‌ రెబల్‌ భీమన్నగౌడ్‌, కాంగ్రెస్‌ మద్దతుదారు శేఖర్‌కు సమానంగా ఓట్లు వచ్చాయి. టాస్ వేయడానికి నిరాకరించడంతో, ఎన్నికల అధికారులు ఒక చెల్లని ఓటును తీసుకుని, స్కేల్‌తో కొలిచి భీమన్నగౌడ్‌ వైపు స్వస్తిక్ ముద్ర ఎక్కువ ఉందని నిర్ధారించి, ఆయన్ను ఒక్క ఓటు మెజార్టీతో విజేతగా ప్రకటించారు.

News December 15, 2025

WGL: రెండో విడతలోనూ హస్తం హవా!

image

ఉమ్మడి జిల్లాలో జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మొత్తం 564 స్థానాలకు గాను ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ 332 చోట్ల జెండా ఎగురవేసింది. బీఆర్‌ఎస్ 179 స్థానాలతో సరిపెట్టుకోగా, స్వతంత్రులు 42 చోట్ల సత్తా చాటారు. బీజేపీ 10 స్థానాలకు పరిమితమైంది. వంజరపల్లి జీపీకి ఎస్టీ రిజర్వేషన్ కేటాయించగా అక్కడ సర్పంచ్‌ పోటీకి ఎవరు లేకపోవడంతో ఎన్నికలు నిలిచిపోయాయి.

News December 15, 2025

ప.గో: రెండేళ్లకే ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’

image

వయసుకు మించిన జ్ఞాపకశక్తితో తణుకు మండలం ముద్దాపురానికి చెందిన రెండేళ్ల చిన్నారి కొయ్యలమూడి బృహతి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. మహాభారతం, వినాయకుని చరిత్ర వంటి ఇతిహాసాలను, ఆధ్యాత్మిక విషయాలను ఈ చిన్నారి అనర్గళంగా చెబుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. కుమార్తె ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు గోవర్ధన్, అనూష ఆమెను ప్రోత్సహించడంతో ఈ అరుదైన ఘనత సాధ్యమైంది.