News December 31, 2025
VJA: క్లౌడ్ పెట్రోలింగ్.. 42 డ్రోన్స్‌తో నగరంలో జల్లెడ

విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజా భద్రత కోసం క్లౌడ్ పెట్రోలింగ్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో 41 డ్రోన్లు అందుబాటులో ఉండగా, మొత్తం 5,790 డ్రోన్ బీట్‌లు నిర్వహించారు. వీటిలో పండుగలు, ర్యాలీలు, విద్యాసంస్థలు, వీఐపీ విధులు, గుంపుల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దసరా ఉత్సవాలు, భవాని దీక్షలు విజయవంతం కావడానికి సాంకేతిక పరిజ్ఞానం కారణం.
Similar News
News January 1, 2026
WGL: పోలీసుల నిఘా ఫలితం.. కమిషనరేట్‌లో ‘సున్నా’ ప్రమాదాలు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలు ప్రమాదరహితంగా ముగిశాయి. పోలీసులు చేపట్టిన ‘స్పెషల్ డ్రైవ్’ ఫలితంగా ఒక్క రోడ్డు ప్రమాదం కూడా నమోదు కాలేదు. రాత్రి పొద్దుపోయే వరకు ప్రతి జంక్షన్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడం, వాహనదారుల వేగానికి బ్రేక్ వేయడంతోనే ఈ విజయం సాధ్యపడింది. ముఖ్యంగా ప్రమాదకరమైన మలుపులు, ప్రధాన రహదారులను పోలీసులు తమ అదుపులోకి తీసుకుని పర్యవేక్షించారు.
News January 1, 2026
న్యూఇయర్ రిజల్యూషన్స్ తీసుకుంటున్నారా?

న్యూఇయర్ అనగానే కొత్త ఆశలు, సంతోషాలు. ఈ సందర్భంగా చాలామంది కొత్త తీర్మానాలు తీసుకుంటారు. కానీ ఆ దిశగా చేసే ప్రయత్నాలు నాలుగురోజులకే పరిమితం అవుతాయి. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు మానసిక నిపుణులు. పట్టుదల ఉండాలేగానీ అనుకున్నవి సాధించడం కష్టమేం కాదు. స్లో అండ్ స్టడీ విన్స్ బాటలోనే పయనించాలి. ✍️ న్యూఇయర్ రిజల్యూషన్స్ టిప్స్ గురించి తెలుసుకోవడానికి <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>కి వెళ్లండి.
News January 1, 2026
‘బొకేలు వద్దు.. బుక్సే ముద్దు’

అనంతపురం, సత్యసాయి జిల్లాల ప్రజలకు కలెక్టర్లు ఆనంద్, శ్యాంప్రసాద్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026లో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, కొత్త ఏడాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. సందర్శకులు బొకేలు, కేకులకు బదులు విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు, పెన్నులు తీసుకురావాలని కోరారు. అనంతపురం కలెక్టరేట్‌లో ఉ.10 నుంచి ‘మీట్ అండ్ గ్రీట్’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.


