News December 11, 2025

VJA: గుండు కొట్టించు.. వంద సమర్పించు.!

image

భవానీ మాల విరమణకు వచ్చిన భక్తుల నుంచి కేశఖండన శాలల సిబ్బంది అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు. తలనీలాలు సమర్పించేందుకు టికెట్‌‌కు రూ.40 ఉన్నప్పటికీ, అదనంగా రూ.100 ఇవ్వాలని క్షవరకులు డిమాండ్ చేస్తున్నారు. ముందు డబ్బులు ఇస్తేనే గుండు చేస్తామని ఆంక్షలు పెడుతున్నారు. మైకుల్లో డబ్బులు చెల్లించవద్దని ప్రకటిస్తున్నా, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 13, 2025

2026లో ఉద్యోగాల జాతర.. RRB క్యాలెండర్ విడుదల

image

2026 ఉద్యోగ నియామకాలకు సంబంధించి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరిలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) నోటిఫికేషన్‌ రిలీజ్ కానుంది. మార్చిలో టెక్నీషియన్, ఏప్రిల్‌లో సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. జులైలో పారామెడికల్, జేఈ, ఆగస్టులో NTPC, సెప్టెంబరులో మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీలు, అక్టోబర్‌లో గ్రూప్-D నియామకాలు ఉండనున్నాయి.

News December 13, 2025

కస్టమ్స్‌ కమిషనర్ ఆఫీస్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

కోచిలోని కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ఆఫీస్‌లో 19 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ట్రేడ్స్‌మన్, సీమ్యాన్, గ్రేసర్, సీనియర్ స్టోర్ కీపర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. సీనియర్ స్టోర్ కీపర్ పోస్టుకు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: taxinformation.cbic.gov.in/

News December 13, 2025

సంగారెడ్డి: ఓటేయడానికి ఇవీ తీసుకెళ్లండి !

image

ఓటర్లు తమ గుర్తింపుకు EPIC కార్డు (ఓటర్ ఐడీ) లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించిన ప్రత్యామ్నాయ పత్రాల్లో ఏదో ఒకదాన్ని చూపించవచ్చు. ఆధార్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఫొటోతో కూడిన బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ పాస్బుక్, రేషన్ కార్డు, పట్టాదారు పాస్బుక్, ఉపాధి జాబ్ కార్డు, దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం, పెన్షన్ పత్రాలు తదితరాలు చెల్లుబాటు అవుతాయి.