News September 12, 2025

VJA: చికిత్స పొందుతున్న డయేరియా బాధితులు 106 మంది

image

విజయవాడ న్యూ రాజ‌రాజేశ్వ‌రిపేట డ‌యేరియా కేసుల 194కు చేరినట్లు కలెక్టర్ లక్ష్మీశా శుక్రవారం రాత్రి 7 గంటలకు విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించారు. కలెక్టర్ విడుదల చేసిన బుల్ టెన్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొత్తం న‌మోదైన కేసులు: 194, ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్న‌వారు: 106, చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయిన‌వారు: 88గా ఉన్నాయి.

Similar News

News September 13, 2025

గోదావరిఖని: ప్రజా భవన్‌ను ముట్టడించిన కార్మిక సంఘాల జేఏసీ

image

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై జేఏసీ నాయకులు, కార్మికులు హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌ను శుక్రవారం ముట్టడించారు. వారికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, గుమ్మడి నర్సయ్య నిలిచారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి సమస్యలపై విన్నవించారు. వేతనాలను పెంచాలని, లాభాల వాటా రూ.20 వేలు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

News September 13, 2025

గోదావరిఖని: దేవదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌కు వినతి

image

గోదావరిఖనిలోని కోదండ రామాలయ జూనియర్‌ అసిస్టెంట్‌, కార్యనిర్వహణ అధికారిపై చర్యలు తీసుకోవాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌కు ఎల్‌బీనగర్‌కు చెందిన మామిడి కుమారస్వామి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఆలయానికి రావాల్సిన ఆదాయాన్ని వీరు అక్రమంగా వారి బ్యాంక్‌ ఖాతాల్లో బదిలీ చేసుకుంటున్నారని తెలిపారు. భక్తులతో కూడా దురుసుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

News September 13, 2025

విదేశీ ఉపాధి అవకాశాల వినియోగంపై దృష్టి పెట్టాలి: పెద్దపల్లి కలెక్టర్

image

TG iPASS కింద వచ్చిన ప్రతి దరఖాస్తు నిర్దిష్ట గడువులో అనుమతులు ఇవ్వాలని, ఫైల్ మూమెంట్‌లో ఆలస్యం లేకుండా అధికారులు టైమ్ బౌండ్ విధానంలో పనిచేయాలని PDPL కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఈరోజు పరిశ్రమలు, DEET అధికారులతో సమావేశం నిర్వహించారు. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, టామ్‌కామ్ ద్వారా విదేశీ ఉద్యోగ అవకాశాల వినియోగంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశ్రమల అధికారి కీర్తి కాంత్ పాల్గొన్నారు.