News February 27, 2026

VJA: చెన్నై వెళ్లే రైలు ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్త

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై సెంట్రల్(MAS), సంత్రాగచ్చి (SRC) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. నెం.06077 MAS- SRC రైలును రేపు శనివారం నుంచి మార్చి 14 వరకు ప్రతి శనివారం, నెం.06078 SRC- MAS రైలును మార్చి 2 నుంచి మార్చి 16 వరకు ప్రతి సోమవారం నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

Similar News

News March 2, 2026

ఇరాన్‌లో ఎంత మంది చనిపోయారంటే..

image

మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధం మారణహోమమే సృష్టిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న దాడుల కారణంగా ఇరాన్‌లో ఇప్పటి వరకు 555 మంది మరణించినట్లు ఆ దేశంలోని రెడ్ క్రెసెంట్ సంస్థ ప్రకటించింది. మొత్తం 131 నివాసాలను టార్గెట్ చేసినట్లు వెల్లడించింది. గాయపడిన వారి వివరాలను మాత్రం చెప్పలేదు. శనివారం ప్రకటించిన సమాచారం ప్రకారం.. 201 మంది చనిపోగా, 747 మంది గాయపడ్డారు.

News March 2, 2026

గద్వాల: రేపు చంద్రగ్రహణం.. జమ్ములమ్మ ఆలయం మూసివేత

image

చంద్ర గ్రహణం కారణంగా గద్వాల పట్టణం జమ్మిచేడులోని జమ్ములమ్మ & పరశురామ స్వామి దేవస్థానాన్ని రేపు మూసివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్.పురందర్ కుమార్ తెలిపారు. పౌర్ణమి రోజైన మంగళవారం ఉదయం 6:00 గంటల నుంచే ఆలయ ద్వారాలు మూసివేస్తామని పేర్కొన్నారు. తిరిగి మరుసటి రోజు బుధవారం ఉదయం 6:00 గంటలకు ఆలయ శుద్ధి, అలంకరణ పూర్తి చేసిన తర్వాతే భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించనున్నారు.

News March 2, 2026

కడప: నేటి ఇంటర్ పరీక్షలకు 96% విద్యార్థులు హాజరు.!

image

కడప జిల్లాలో సోమవారం 62 సెంటర్లలో ఇంటర్ 1st ఇయర్ మ్యాథమాటిక్స్ పేపర్-1 పరీక్షలకు 96% విద్యార్థులు హాజరయ్యారు. 10,926 మందికి గాను.. 10,463 మంది పరీక్షలు రాయగా, 463 మంది ఆబ్సెంట్ అయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 9,588 మందికి గాను.. 9,284 మంది హాజరవ్వగా, 304 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,338 మందికి గాను.. 1,179 మంది పరీక్షలు రాశారు. 159 మంది విద్యార్థులు పరీక్షలు రాయలేదు.