News September 14, 2025
VJA: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం అప్డేట్

మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇరువురు వ్యక్తులు దుర్మరణం చెందినట్లు గూడూరు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తులు విజయవాడ శివారు తాడిగడపకు చెందిన ఆదాం బాబు, షరీన్‌గా పోలీసులు గుర్తించారు. వీరు ద్విచక్ర వాహనంపై మచిలీపట్నం బీచ్‌కి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు చెప్పారు.
Similar News
News September 14, 2025
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు

శనివారం సాయంత్రం 5 గంటల వరకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 12 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 1,12,226 క్యూసెక్కుల వరద నీరు భారీగా చేరుతోంది. ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 148.00 మీటర్ల నీటిమట్టం ఉండాల్సిన ప్రాజెక్టులో ప్రస్తుతం 147.81 మీటర్ల వద్ద నీటిమట్టం కొనసాగుతోంది. 20.175 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 19.6475టీఎంసీల నీరు నిల్వ ఉంది.
News September 14, 2025
జొన్న: కాండం తొలుచు పురుగు.. నివారణ

* పంట వేసిన 35 రోజుల నుంచి కాండం తొలుచు పురుగు ఆశిస్తుంది. దీని నివారణకు ఎకరానికి 4 కేజీల కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలను కాండం సుడుల్లో వేయాలి.
* కత్తెర పురుగు లార్వా దశలో ఉంటే వేపనూనె(అజాడిరక్టిన్) 1500 పిపిఎం 5 ML లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
* పురుగు తీవ్రత అధికంగా ఉంటే క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 ML, ఒక లీటరు నీటికి కలిపి సుడుల్లో పడేలా పిచికారీ చేయాలి.
News September 14, 2025
HYD: పొలిటికల్ డ్రామా.. ఓవర్ టూ అసెంబ్లీ

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన MLAల భవిత నేడు కీలక మలుపు తీసుకోనుంది. ‘పార్టీ మార్పు’పై ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు అసెంబ్లీలో స్పీకర్‌కు తమ అభిప్రాయం చెప్పబోతున్నారు. మధ్యాహ్నం అసెంబ్లీ కార్యదర్శితో BRS నాయకులు సమావేశం కానున్నారు. వారిచ్చే రియాక్షన్‌ను బట్టి స్పీకర్ చర్యలు తీసుకోబోతున్నారు. ఈ తాజా రాజకీయ పరిణామాలతో నగరంలో పోలిటికల్ హీట్ మొదలైంది.