News March 13, 2025

VJA: టీడీపీ నేతలపై కేసు కొట్టివేత

image

ఓబులాపురం మైనింగ్‌పై గతంలో టీడీపీ నేతలు చేసిన ఆందోళనలకు సంబంధించిన కేసును విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, చినరాజప్ప, ధూళిపాళ్ల నరేంద్ర, జనార్దన్ రెడ్డి సహా పలువురు నేతలు ఈ కేసు నుంచి విముక్తి పొందారు. గురువారం ఉదయం విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు వద్దకు టీడీపీ శ్రేణులు చేరుకున్నారు.

Similar News

News February 28, 2026

కడప జిల్లాలో నేటి ఇంటర్ పరీక్షలకు 4,470 మంది విద్యార్థులు హాజరు.!

image

కడప జిల్లాలో శనివారం 62 సెంటర్లలో ఇంటర్ 2nd ఇయర్ బాటనీ, హిస్టరీ పరీక్షలు జరిగాయి. మొత్తం 4,626 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 4,470 మంది రాశారు. 156 మంది ఆబ్సెంట్ అయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 3,473 మందికి గాను.. 3,383 మంది పరీక్షలకు హాజరయ్యారు. 93 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,153 మందికి గాను.. 1,087 మంది పరీక్షలు రాశారు. 66 మంది ఆబ్సెంట్ అయ్యారు.

News February 28, 2026

స్టే.ఘ: నిజంగా ఆ స్వామి చూసినట్లే!

image

కలియుగ దైవమైన ఆ వేయి నామాల వెంకటేశ్వరుడే కళ్లముందు కదలాడినట్లే అనిపించింది ఆ ఒక్క క్షణం. జనగామ జిల్లా చిల్పూరు గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ వేడుకల్లో ఓ యువతిని వెంకటేశ్వర స్వామి వేషాధరణలో అలంకరించి కళ్యాణ మండపం వద్ద ఉంచగా నిజంగా స్వామివారి చూసినట్లేనని ఉందని చూసినవారు అనుకున్నారు.

News February 28, 2026

అనకాపల్లి జిల్లాకు భారీ పరిశ్రమ.. వద్దంటూ ఆందోళన

image

సీతపాలెం సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న బ్లూ జెట్ ఫార్మా పరిశ్రమ ఏర్పాటును నిలుపుదల చేయాలని పూడిమడక అఖిలపక్ష నాయకులు, మత్స్యకారులు శనివారం కోరారు. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో గల ఏపీ సెజ్‌లో ఏర్పాటైన ఫార్మా కంపెనీలు నుంచి విడుదల అవుతున్న వాయుకాలుష్యం, జల కాలుష్యం వలన పూడిమడక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పుడు ఈ బ్లూ జెట్ ఫార్మా ఏర్పాటు వల్ల మరింత నష్టం జరుగుతుందని చెప్పారు.