News March 28, 2025
VJA: ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్‌ల అందజేత

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో విజయవాడ నగర దాతలు డాక్టర్ రమేశ్, లక్ష్మణ చౌదరి సహాయంతో ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ బ్యాగ్‌లు అందజేశారు. వీటిలో మిల్టన్/సెల్లో వాటర్ బాటిల్స్, ఎలక్ట్రాల్ సాచెట్‌లు, నాప్‌కిన్లు, ఫాస్ట్‌ట్రాక్ కళ్లజోడు, క్యారీ బ్యాగ్ ఉన్నాయి. ఈ కిట్‌ను సీపీ శుక్రవారం ట్రాఫిక్ సిబ్బందికి అందించారు.
Similar News
News February 17, 2026
అనకాపల్లి: 21న జడ్పీ స్థాయి సమావేశాలు

ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ఈనెల 21వ తేదీన నిర్వహించనున్నట్లు సీఈవో నారాయణమూర్తి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జడ్పీ ఛైర్‌పర్సన్ సుభద్ర అధ్యక్షతన విశాఖ జడ్పీ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సమావేశాలు ప్రారంభం అవుతాయన్నారు. ఈ మేరకు జడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి రావాలన్నారు.
News February 17, 2026
VZM: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసి మృతి చెందిన ఘటన అనకాపల్లి(D) కె.కోటపాడులోని సూర్రెడ్డిపాలెం జంక్షన్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన బండారు దేముడునాయుడు(30) బైక్ పై సబ్బవరం వెళ్తుండగా సూర్రెడ్డిపాలెం వద్ద అదుపుతప్పి కింద పడిపోయాడు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 17, 2026
HYD: ఈ అలవాట్లతో ప్రాణానికి ముప్పు!

మారుతున్న ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం యువత ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాత్రి ఆలస్యంగా భోజనం, ఉప్పు-చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు పెరుగుతున్నాయని తెలిపారు. విపరీతమైన స్క్రీన్ టైమ్ జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతోందన్నారు. తగినంత నీరు తాగకపోవడం కిడ్నీ రాళ్లకు దారితీస్తోందని సూచించారు. కాలుష్యం కూడా ఆరోగ్యానికి ముప్పుగా మారాయన్నారు.


