News September 22, 2025

VJA: ‘దసరా సెలవుల్లో స్కూల్ నిర్వహిస్తే కఠిన చర్యలు’

image

ప్రభుత్వం నేటి నుంచి దసరా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో, పదో తరగతి విద్యార్థులకు ఎలాంటి ప్రత్యేక తరగతులు, స్టడీ అవర్స్, పేరెంట్స్ మీటింగ్‌లు నిర్వహించరాదని DEO సుబ్బారావు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం DEO ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Similar News

News September 22, 2025

HYD: 24 నుంచి దుర్గామాత మండపాలకు ఫ్రీ కరెంట్

image

సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దుర్గామాత మండపాలకు ఉచిత కరెంటు అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్రేటర్ పరిధిలో అమ్మవారి మండపాలు ఏర్పాటు చేసేవారు స్థానిక PSలో సమాచారం అందజేసి, అనంతరం ఎలక్ట్రిసిటీ అధికారులకు సమాచారం ఇస్తే ఉచిత కరెంట్ అందేలా చర్యలు తీసుకుంటారని TGSPDCL AE నిఖిల్ తెలిపారు.

అన్ని నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలు: మంత్రి లోకేశ్

image

AP: అమరావతిలో రూ.150కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో లైబ్రరీ నిర్మాణాన్ని చేపడుతున్నామని, 24నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘కొత్త జిల్లాల ప్రాతిపదికన 26 జిల్లా గ్రంథాలయాలు, 175 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలు తెస్తాం. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన అన్ని పుస్తకాలను అందుబాటులోకి తెస్తాం. మోడల్ లైబ్రరీలకు సంబంధించిన యాప్‌ను 100 రోజుల్లో ఆవిష్కరిస్తాం’ అని అసెంబ్లీలో అన్నారు.