News January 10, 2026
VJA: దుర్గమ్మ శ్రీచక్రార్చన పాలలో పురుగు.. వాస్తవమెంత?

దుర్గమ్మ సన్నిధిలో శుక్రవారం ఉదయం కలకలం రేగింది. ప్రతిరోజూ అమ్మవారికి నిర్వహించే శ్రీచక్రార్చన కోసం సిద్ధం చేసిన పాల ప్యాకెట్లలో ఒక దానిలో పురుగు కనిపించింది. అర్చకులు వెంటనే ఆ పాలను పక్కన పడేసి ఇతర పాలతో అర్చన పూర్తి చేశారు. కొన్నేళ్లుగా ప్యాకెట్ పాలు, విడిగా ఆవుపాలను సేకరిస్తున్నామని, ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు ఎదురుకాలేదని, ఈ విషయాన్ని కొందరు కావాలనే పెద్దది చేస్తున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి.
Similar News
News February 15, 2026
వేములవాడకు చేరుకున్న మంత్రి పొన్నం

వేములవాడలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం రాత్రి వేములవాడ భీమేశ్వరాలయం గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. ఆలయ ఈవో రమాదేవి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి రాజరాజేశ్వరస్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈరోజు ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
News February 15, 2026
ఏలూరు: ఆ అధికారి అవినీతి జలగ!

కోటరామచంద్రపురంలోని ఐటీడీఏలో విధులు నిర్వహిస్తున్న ఒక ఉన్నతాధికారి అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారారు. అంతే కాకుండా తన పరిధిలో ఉన్న వసతి గృహాల్లో పనిచేస్తున్న సిబ్బందిని తన సొంత అవసరాలకు వాడుకుంటున్నారట. ఒక వార్డెన్ ఇటీవల అక్రమాలు చేస్తూ దొరికినా చర్యలు తీసుకోవడం మానేసి ఆ వార్డెన్‌తో సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం. గతంలోనూ ఇక్కడ పని చేసిన అధికారిది ఇదే తంతు కావడంతో విధుల నుంచి తప్పించడం గమనార్హం.
News February 15, 2026
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ముప్పు ఎవరికి ఎక్కువంటే?

* గతంలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్లలో మరోసారి కూడా వచ్చే అవకాశముంది. * భాగస్వామి నుంచి గనేరియా, క్లమీడియా వంటి లైంగిక సంబంధిత ఇన్ఫెక్షన్లు సోకిన మహిళల్లో ఈ ముప్పు కనిపించవచ్చు. * సంతాన సాఫల్యత కోసం చికిత్సలు తీసుకుంటున్నవారు. * ఫెలోపియన్ ట్యూబుల్లో లోపాలుండి, వాటిని సరిదిద్దేందుకు శస్త్రచికిత్స తీసుకున్నవారు. * పొగతాగే అలవాటు ఉన్న మహిళల్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి అవకాశాలు ఎక్కువ.


