News February 21, 2025

VJA: నేడు కోర్టు తీర్పు

image

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టైన వైసీపీ నేత వంశీ కస్టడీ, హెల్త్ పిటిషన్‍పై గురువారం విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఇరువర్గాల వాదనలు పూర్తి అయ్యాయి. కాగా ఈ రెండింటిపై శుక్రవారం కోర్టు తీర్పు ఇవ్వనున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది. అటు నేడు వంశీ సహా ఈ కేసులోని మరో ఇద్దరు నిందితుల కస్టడీ పిటిషన్లపై కోర్టు తీర్పు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Similar News

News December 28, 2025

ఇతరుల చెప్పులు, దుస్తులు ఎందుకు ధరించకూడదు?

image

ఇతరుల వస్త్రాలు, చెప్పులు ధరిస్తే వారిలోని ప్రతికూల శక్తి మనకు బదిలీ అవుతుందని నమ్మకం. ప్రతి వ్యక్తికీ ఓ ప్రత్యేకమైన శక్తి తరంగాలు ఉంటాయి. ఇతరుల వస్తువులను వాడటం వల్ల వారి జాతక దోషాలు, దురదృష్టం మనపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది మానసిక ప్రశాంతతను, ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుందని జ్యోతిషులు చెబుతారు. ఆరోగ్యపరంగానూ నష్టాలున్నాయి. చర్మవ్యాధులు, ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా సులభంగా వ్యాప్తి చెందుతాయి.

News December 28, 2025

స్త్రీధనాన్ని క్లెయిం చేసుకోవచ్చు

image

మహిళ తన భర్త నుంచి విడిపోయే క్రమంలో స్త్రీధనాన్ని క్లెయిం చేయొచ్చు. అయితే భార్య తల్లిదండ్రులు భర్తకు ఇచ్చిన బహుమతులు, భార్య పేరిట భర్త ఏదైనా చర, స్థిరాస్తి కొన్నా, వివాహిత తన నెలవారీ సంపాదనలో కొంత మొత్తాన్ని ఇంటి ఖర్చుల కోసం వాడినవి స్త్రీధనం పరిధిలోకి రావు. వాటిని క్లెయిం చేసుకోవడం కుదరదు. మహిళ తనకు స్త్రీ ధనంగా వచ్చిన విలువైన వస్తువులు, కానుకల జాబితాను రాసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News December 28, 2025

ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>ఇర్కాన్ <<>>ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ 20 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. బీటెక్(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు జనవరి 12, 13, 15 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. ఎంపికైన వారికి నెలకు జీతం రూ.60వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.ircon.org