News December 3, 2025
VJA: నేడు సిట్ ముందుకు వైసీపీ నేతల కుమారులు

కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారులు నేడు విచారణకు హాజరు కానున్నారు. విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు ఇప్పటికే వారికి నోటీసులు జారీ చేశారు. జోగి రాజీవ్, రోహిత్ కుమార్, రాకేశ్, రామ్మోహన్‌కు నోటీసులు అందించారు. ఈ మేరకు గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద వారు విచారణకు హాజరు కానున్నారు. లాప్‌టాప్‌లోని సమాచారం కోసం విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.
Similar News
News December 4, 2025
సిరిసిల్ల జిల్లాలో 657 మంది బైండోవర్: SP

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 158 కేసులలో 657మందిని బైండోవర్ చేసినట్టు ఎస్పీ మహేష్ బిగితే అన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆయన ఎన్నికల నామినేషన్ కేంద్రాలు, చెక్ పోస్టులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించి 20 కేసుల్లో 209 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
News December 4, 2025
ఎన్నికలు ఉన్నప్పుడే రాజకీయాలు చేయాలి: CM

ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలని ఎన్నికల తర్వాత రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని CM రేవంత్ రెడ్డి అన్నారు. బుధవార ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మాట్లాడారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్ష నాయకులకు అవకాశం ఇచ్చేవి కావని గుర్తు చేశారు. సచివాలయానికి రానివ్వకుండా తనను, మంత్రి సీతక్కను అడ్డుకున్నారని తెలిపారు.
News December 4, 2025
వరంగల్: పీ.డీ.ఎస్.యూ రాష్ట్ర మహాసభలు వాయిదా..!

డిసెంబర్ 10, 11, 12 తేదీలలో వరంగల్ నగరంలో నిర్వహించనున్న ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ.డీ.ఎస్.యూ) తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలు వాయిదా పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా 2026 జనవరి 5, 6, 7 తేదీలకు వాయిదా వేస్తున్నట్లు సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వి.శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు తెలిపారు.


