News March 31, 2025

VJA: పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక విషయాలు

image

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆదివారం బెజవాడలో ప్రవీణ్ కేసు విచారణలో సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రమాదం జరిగిన రోజు ప్రవీణ్ గుంటుపల్లి నుంచి భవానీపురం మధ్య బైక్‌తో సహా రోడ్డుపై పడిపోయినట్లు సీసీ ఫుటేజీలో కనిపించింది. అదే సమయంలో అతని బైక్ డోమ్ పగిలినట్లు గుర్తించారు. త్వరలో మరిన్ని వివరాలు వివరించనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News February 17, 2026

ఒత్తిడే అసలు శత్రువు!

image

మానసిక ఒత్తిడి గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘మనం ఒత్తిడికి గురైనప్పుడు మెదడులోని నాడీ వ్యవస్థ వేగంగా స్పందిస్తుంది. దీనివల్ల BP, హార్ట్ బీట్ పెరగడమే కాకుండా రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఇది రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచి చివరికి గుండెపోటుకు దారితీస్తుంది. గుండె ఆరోగ్యం కోసం యోగా, ధ్యానం వంటి పద్ధతుల ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి’అని సూచిస్తున్నారు.

News February 17, 2026

మదనపల్లె: హంతకుని ఇంట్లోనే బాలిక డెడ్ బాడీ

image

అన్నమయ్య జిల్లాలో తీవ్ర సంచలనం రేకెత్తించిన బాలిక హత్య ఉదంతం మంగళవారం వెలుగులోకి రావడం తెలిసిందే. హంతకుడు కులవర్ధన్ రిషిక ప్రియపై లైంగిక దాడికి పాల్పడి, వ్యవహారం వెలుగులోకి రాకుండా ఆపై దారుణంగా హత్య చేసి నీళ్ల డ్రమ్ములో దాచినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హంతకుడి ఇంట్లోనే డెడ్ బాడీ ఉండడంతో క్లూస్ టీంను రప్పించారు.

News February 17, 2026

మదనపల్లె: పోలీసుల అదుపులో నిందితుడు

image

మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లి రామిరెడ్డి లే అవుట్‌లో బాలిక దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడని అనుమానిస్తున్న కులవర్ధన్‌ను వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారం చేసి ఆపై దారుణంగా హత్య చేసి డ్రమ్ములో వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా హత్య ఉదంతాన్ని వన్ టౌన్ సీఐ మహమ్మద్ రఫీ వెలుగులోకి తెచ్చారు.