News December 3, 2025
VJA: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

పోక్సో కేసులో నిందితుడికి న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఓ బాలికపై 2021వ సంవత్సరంలో అదే ప్రాంతానికి చెందిన వసంత్ కుమార్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లి ఫిర్యాదు మేరకు వసంత్ కుమార్‌పై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మంగళవారం నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి భవాని తీర్పునిచ్చారు.
Similar News
News December 4, 2025
కండలేరుకు పెరుగుతున్న వరద నీరు

కండలేరు జలాశయం నీటిమట్టం గంట గంటకు పెరుగుతోంది. గురువారం ఉదయం 6 గంటలకు 6,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 11 గంటలకు 28 వేల క్యూసెక్కులకు పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో కండలేరుకు వరద ప్రవాహం పెరుగుతోంది. భారీగా ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో ప్రస్తుతం కండలేరులో నీటిమట్టం 60 టీఎంసీలకు చేరింది. నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
News December 4, 2025
అఖండ-2 ప్రీమియర్స్ రద్దు.. కారణమిదేనా?

వివాదాల కారణంగానే ‘అఖండ-2’ ప్రీమియర్లు <<18466572>>రద్దైనట్లు<<>> తెలుస్తోంది. ఈరోస్ ఇంటర్నేషనల్‌కు 14 రీల్స్ సంస్థ రూ.28Cr చెల్లించాల్సిన వివాదం నేపథ్యంలో సినిమాను <<18465729>>ఆపాలని<<>> మద్రాసు HC ఆదేశించింది. అటు మూవీకి పనిచేసిన కొందరు టెక్నీషియన్లు కూడా తమకు వేతనాలు ఇవ్వలేదంటూ ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఈ కారణాలతోనే ప్రీమియర్స్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. కానీ టెక్నికల్ గ్లిచ్ వల్లే ఆగిపోయినట్లు 14 రీల్స్ చెబుతోంది.
News December 4, 2025
జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా..

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.1903, కనిష్ఠ ధర రూ.1750; వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.2052, కనిష్ఠ ధర రూ.2005; వరి ధాన్యం (BPT) ధర రూ.2100; వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.3014, కనిష్ఠ ధర రూ.2651గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.


