News September 13, 2025

VJA: ఫుడ్ పాయిజనే కారణమా?

image

బయట వేయించిన చికెన్, చేపలు, ఇతర ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయి డయేరియా వ్యాప్తికి కారణమని కొందరు వైద్యాధికారులు చెబుతున్నారు. ఇవి బాధితులు చెప్పిన విషయాలు మాత్రమేనని, నిర్ధారణ కోసం పంపిన ఫుడ్ శాంపిల్స్ రిపోర్టులు ఇంకా రాలేదని సమాచారం. డయేరియా అదుపులోనే ఉందని ప్రజలను మభ్యపెడుతున్నారనే ఆరోపిణలూ వినిపిస్తున్నాయి. కేసులు పెరుగుతున్నా అధికారులు సీరియస్‌గా తీసుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.

Similar News

News September 13, 2025

మోదీ మణిపుర్ పర్యటనపై కాంగ్రెస్ విమర్శలు

image

ఘర్షణలు జరిగిన రెండేళ్ల తర్వాత PM మోదీ మణిపుర్‌ <<17696611>>పర్యటన<<>>కు వెళ్లడం అక్కడి ప్రజలను అవమానించడమేనని INC మండిపడింది. ‘864 రోజుల ఘర్షణలో 300 మంది చనిపోయారు. 1500 మంది గాయపడ్డారు. 67వేల మంది నిర్వాసితులయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు PM 46 విదేశీ పర్యటనలు చేశారు కానీ ఒక్కసారి కూడా మణిపుర్‌లో పర్యటించలేదు’ అని ఖర్గే విమర్శించారు. రెండేళ్ల తర్వాత మోదీ మణిపుర్ వెళ్లడం దురదృష్టకరమని ప్రియాంకా గాంధీ అన్నారు.

News September 13, 2025

నెల్లూరు: ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కి మైథిలి కళ్లు దానం

image

స్నేహితుడి చేతిలో దారుణ హత్యకు గురైన మైథిలి ప్రియా కళ్లను ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కి కుటుంబ సభ్యులు దానం చేయనున్నారు. ప్రస్తుతం మైథిలి మృతదేహం నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉంది. గత రాత్రి మైథిలిని ఆమె స్నేహితుడు నిఖిల్ దారుణంగా హత్య చేశాడు. మృతురాలు బి ఫార్మసీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది.

News September 13, 2025

సిరిసిల్ల: సన్నాలకు బోనస్ అందేదెప్పుడు..?

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతన్నలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు సన్నం వడ్లను సాగు చేశారు. కాగా, వీరంతా రూ.500 బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. యాసంగిలో సుమారు 10 వేల క్వింటాళ్లకు పైగా సన్నాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే ఇప్పటివరకు బోనస్ పడలేదు. బోనస్ వస్తే పంట పెట్టుబడికి సాయంగా ఉంటుందని రైతన్నలు అంటున్నారు. ప్రభుత్వ స్పందించి ఖాతాల్లో బోనస్ వేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.